ఆమెతో ఉంటే ఓ ఎనర్జీ వస్తుంది...!

  • 6 years ago
Director Sukumar took the opportunity to take the audience back to the 80s with Rangasthalam 1985. This film features Ram Charan, Samantha Akkineni, Aadhi Pinisetty, Anasuya Bharadwaj and Jagapati Babu in the lead roles. Ram Charan will be seen essaying the role of Chitti Babu in this film.

రంగస్థలం సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కార్యక్రమానికి విశాఖ సాగరతీరం వేదికైంది. ఈ కార్యక్రమం కోసం భారీగా మెగా ఫ్యాన్స్ తరలివచ్చారు. చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాంచరణ్, ఉపాసన, సమంత, అనసూయ, సుకుమార్, దేవీ శ్రీ ప్రసాద్ తదితరులు హాజరయ్యారు.. ఈ సందర్భంగా రాంచరణ్ మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు.
ఉగాది పండుగ రోజు మెగా ఫ్యాన్స్ అనే కుటుంబంతో గడపడం చాలా ఆనందంగా ఉంది. ఎంతో వ్యయప్రయాసలకు ఓర్చి ఈ సినిమాను నిర్మించిన మైత్రీ మూవీస్ అధినేతలకు ధన్యవాదాలు. గ్రామంలో ఉండే గొడవలు ఎలా ఉంటాయో అలాంటివి వాటికి రాంలక్ష్మణ్ ఫైట్స్ కంపోజ్ చేశారు.
గ్రామీణ ప్రాంతంలో పెరగలేదనే బాధ పోయింది. చిన్నప్పుడు మా తాత గారు నెల్లూరులో పనిచేసేటప్పుడు ఆ ప్రాంతానికి వెళ్లాను. ఆ తర్వాత ఆపద్భాంధవుడు సినిమా షూటింగ్ సమయంలో ఊరు వాతావరణాన్ని చూశాను. ఇప్పుడు రంగస్థలం ద్వారా మళ్లీ గ్రామీణ ప్రాంతాన్ని చూసే అవకాశం కలిగింది.
సమంతతో పనిచేయడం ఓ ఎనర్జీ ఇస్తుంది.అత్తారింటికి దారేది చిత్రంలో సమంత పక్కన నటించిన బాబాయ్ పవన్ కల్యాణ్ చూస్తే ఆమె ప్రతిభ తెలుస్తుంది.
చంద్రబోస్ రాసిన పాటలు ఈ సినిమా హైలైట్.చంద్రబోస్ రాసిన పాటలకు దేవీ శ్రీ ప్రసాద్ అద్భుతమైన పాటలు, సంగీతాన్ని ఇచ్చారు.
మా అమ్మా, నాన్న గర్వపడే సినిమాను సుకుమార్ అందించారు. ప్రతీ క్షణం సుకుమార్ నా నుంచి మంచి నటనను రాబట్టుకోవడానికి చూసేవారు.
రంగస్థలం సినిమాకు ముందు మెగాస్టార్ చిరంజీవికి రాంచరణ్ కొడుకుగా పుట్టడం గర్వం అనేవారు. కానీ రంగస్థలం సినిమా చూసిన తర్వాత రాంచరణ్ తమ కొడుకుగా పుట్టడం గర్వమని చిరంజీవి, సురేఖగారు చెప్పుకొంటారు అని నటుడు బ్రహ్మజీ అన్నారు.

Recommended