నేనెవర్నీ అలా చూడలేదు : జూనియర్ ఎన్టీఆర్ పై పరుచూరి డైలాగ్స్

  • 6 years ago
Writer Paruchuri Gopala Krishna revealed few interesting incidents about Junior NTR. He said When I was writing dialouges for Aadi movie, I observed NTR Talent and commitment. Even he injured in shoot, he continued the shoot.

సినీ పరిశ్రమలో వరుస విజయాలతో, విభిన్నమైన పాత్రలతో దూసుకెళ్తున్న జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రముఖ సినీ కథా రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. నందమూరి తారక రామారావుతో పోలీకలు చెబుతూ యంగ్ టైగర్‌పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సీనియర్ ఎన్టీఆర్‌లోని మొండిధైర్యం జూనియర్ ఎన్టీఆర్‌కు వచ్చింది అని పరుచూరి చెప్పారు.
జూనియర్ ఎన్టీఆర్ పట్టుదల మాటల్లో చెప్పలేం. నటన పట్ల ఆయనకు ఉన్న ఆరాధన ఏ యువ నటుల్లో చూడలేదు నేను . వైజాగ్‌లో ఆది సినిమా క్లైమాక్స్ సీన్లు చిత్రీకరిస్తున్నాం. ఆ సమయంలో తారక్ చేతికి అద్దాలు గుచ్చుకొన్నాయి. అయితే సినిమా షూటింగ్ ఆగిపోతుంది అని అనుకొన్నాను.
కానీ చేతికి గాయమై రక్తం కారుతున్నా తారక్ అలానే చేసేశారు అని యూనిట్ సభ్యులు చెప్పడంతో నేను కంగుతిన్నాను. వెంటనే నాకు అన్న ఎన్టీఆర్ గారు గుర్తుకు వచ్చారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా షూటింగ్‌ను ఆపడానికి ఎన్టీఆర్ ఇష్టపడేవాడు కాదు అని పరుచూరి గోపాలకృష్ణ చెప్పారు.
సర్దార్ పాపారాయుడు సినిమా క్లైమాక్స్‌లో అన్నగారి చేతికి గాయమైంది. కానీ ఆయన అలాగే బాధతోనే నటించాడు. షూటింగ్ మాత్రం ఆగలేదు. తాత మొండితనమే జూనియర్ ఎన్టీఆర్‌కు వచ్చింది అని అప్పుడే అర్థమైంది అని పరుచూరి వెల్లడించారు.

Recommended