అవిశ్వాస తీర్మానం కోసం ప్రయత్నాలేవీ చెయ్యని జగన్ | Oneindia Telugu

  • 6 years ago
Telugu Desam (TDP) and Telangana Rastra Samiti (TRS) have decided not to support the proposed ‘No Confidence’ motion against the Central government to be moved by YSR Congress (YSRC) on Monday.

ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వం మీద వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించ తలపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వకూడదని తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) నిర్ణయించుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు జగహన్మోహన్ రెడ్డి నిర్ణయానికి దూరంగా ఉండాలని భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ సోమవారం అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించనున్న విషయం తెలిసిందే.
రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇవ్వకూడదని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలని నిర్ణయించింది. నిజానికి మార్చి 21వ తేదీన అవిశ్వాసం ప్రతిపాదించాలని వైసిపి తొలుత నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ నెల 12వ తేదీననే అవిశ్వాసం పెట్టడానికి సిద్ధపడింది.
తాము ప్రతిపాదించే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని జగన్ చంద్రబాబును కోరారు. చంద్రబాబు తన అధ్యక్షతన జరిగిన వ్యూహ కమిటీలో వైసిపి ప్రతిపాదించే అవిశ్వాస తీర్మానంపై అనుసరించాల్సిన వైఖరిపై చర్చించారు. దానికి మద్దతు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు.
అవిశ్వాస తీర్మానం వల్ల కేంద్ర ప్రభుత్వానికి ఏమీ కాదని, దానివల్ల రాష్ట్రానికి ఒనగూరే ప్రయోజనం కూడా ఏమీ లేదని చంద్రబాబు అభిప్రాయపడుతున్నారు. ప్రత్యేక హోదాపై ప్రతిపాదించే అవిశ్వాస తీర్మానం మీద సభలో చర్చకు వచ్చినప్పుడు ఇతర ప్రతిపక్షాలు పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంపై చర్చకు ప్రాధాన్యం ఇస్తాయని, దానివల్ల ఎపికి ప్రత్యేక హోదా అనే డిమాండ్ ప్రాధాన్యం తగ్గిపోతుందని చంద్రబాబు భావిస్తున్నారు.
అవిశ్వాస తీర్మానంతో తమకేమీ సంబంధం లేదని, దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని కేసీఆర్ తన పార్టీ పార్లమెంటు సభ్యులకు సూచించినట్లు సమాచారం. ఎపికి ప్రత్ేక హోదా ఇవ్వాలనే డిమాండుకు మద్దతు ఉంటుంది గానీ అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వబోమని టీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. తమ ప్రాధాన్యాలు తమకు ఉన్నాయని, అటువంటప్పుడు అవిశ్వాస తీర్మానాన్ని బలపరచాల్సిన అవసరం ఏముందని వారు ప్రశ్నిస్తున్నారు.

Recommended