Ashraf Thamarassery, Indian In UAE How Helped Sridevi | Oneindia Telugu

  • 6 years ago
Ashraf Sherry Thamarassery, a 44-year-old Indian from Kerala, helped sign out actress Sridevi's Body to Reach India.

బతుకు ఎంత వైభవంగా సాగితేనేం.. చావులో కాస్త ప్రశాంతత కూడా లేకపోతే?.. చాలామంది సెలబ్రిటీల జీవితాలు ఆఖరి క్షణాల్లో ఆటుపోట్లకు గురైనవే. చావులోనూ ప్రశాంతత దొరకనివారు ఎంతోమంది.
బతికినన్నాళ్లు తన ముఖంలో ఎన్నడూ ప్రశాంతత చెరగని శ్రీదేవికి కూడా అలాంటి పరిస్థితులు ఎదురవడం విచారకరమే. కానీ అనేకానేక మలుపుల మధ్య చివరకు ఆమె అంతిమయాత్ర అంత ప్రశాంతంగా జరిగిందంటే.. దాని వెనకాల ఉన్న ఓ వ్యక్తి గురించి తప్పక గుర్తుచేసుకోవాలి. శ్రీదేవి కోసం బోనీ కపూర్ చేసిందాని కన్నా, ఆమె ఆప్తులు చేసిన దానికన్నా ఆ వ్యక్తి చేసిన సహాయం అపూర్వం
ఆయన పేరు అశ్రఫ్‌ షెర్రీ తమరసెరీ(44). చాలా ఏళ్ల క్రితం కేరళ నుంచి వచ్చి దుబాయ్‌లో స్థిరపడ్డాడు. వృత్తి రీత్యా మెకానిక్‌ అయినా.. ప్రవృత్తి మాత్రం దుబాయిలో మరణించినవారి మృత దేహాలను స్వస్థలాలకు పంపించడమే. దుబాయ్ చట్టాలు అత్యంత కఠినంగా ఉంటాయి. అక్కడ ఫార్మాలిటీస్ పూర్తి చేయడం అంత ఆషా మాషీ కాదు. భారత్ నుంచి దుబాయ్ వెళ్లే వలసజీవులు అక్కడ ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోతే.. వారి మృతదేహాలను స్వస్థలానికి తీసుకురావడం వారి కుటుంబ సభ్యులకు తలకు మించిన భారం. అలాంటి వారెందరినో తమరసెరీ కష్టాల్లో ఆదుకున్నాడు.
దాదాపు18 ఏళ్లుగా 38 దేశాలకు చెందిన 4,700 మృతదేహాలను వారివారి దేశాలకు పంపిచాడు తమరసెరీ. ఇందుకోసం ఆయన ఒక్క పైసా ఆశించలేదు. పైగా తన జేబు నుంచే ఖర్చు పెట్టుకున్న సందర్భాలెన్నో. ఇప్పటికీ ప్రతీరోజూ ఆయన సహాయం కోరుతూ పదుల సంఖ్యలో ఫోన్ కాల్స్ వస్తుంటాయి. శ్రీదేవి మృతదేహాన్ని దుబాయ్ నుంచి తరలించడం ఆలస్యమైన కొద్దీ ఆమె మరణంపై ఊహాగానాలు పెరుగుతూ వచ్చాయి. నిజానిజాల సంగతి పక్కనపెడితే.. అక్కడి ఫార్మాలిటీస్ ను పూర్తి చేసే విషయంలో ఈ జాప్యం మరింత ఎక్కువైంది. ఈ నేపథ్యంలో తమరసెరీ అందించిన సహాయం మరువలేనిది. శవపంచనామా దగ్గరి నుంచి శ్రీదేవి డెడ్ బాడీని తిరిగి విమానంలో ఎక్కించే వరకు ప్రతీ అధికారి చుట్టూ, ఆఫీసు చుట్టూ తమరసెరీ ఎంత ప్రయాస పడ్డాడో. చట్టాలకు లోబడి, నిబంధనలను అనుసరిస్తూ అన్నీ ఫార్మాలిటీస్ ను పూర్తి చేయించి శ్రీదేవి మృతదేహాన్నిఎట్టకేలకు కుటుంబ సభ్యులకు అందేలా చేశాడు.