Sridevi's Final Journey, Wrapped In Flag

  • 6 years ago
Sridevi's final journey has begun, with a decorated truck carrying the iconic actor's mortal remains to the Vile Parle's crematorium, where the final rites will take place.

వేలాది అభిమానుల అశ్రు నయనాల మధ్య ప్రముఖ నటి శ్రీదేవి అంతియయాత్ర ప్రారంభమైంది. శ్రీదేవిని కడసారి చూసేందుకు వేల సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. భారీ సంఖ్యలో అభిమానులు తరలిరావడంతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. విశేష సంఖ్యలో ఫ్యాన్స్ తోడు రాగా అంతిమయాత్ర రథం ముంబైలోని పవన్ హన్స్ శ్మశాన వాటికకు బయలు దేరింది.
శ్రీదేవి అంతియయాత్ర ప్రారంభానికి ముందు మహారాష్ట్ర పోలీసులు తుపాకులు ఎక్కుపెట్టి గాలిలోకి కాల్పులు జరిగి గౌరవ వందనం సమర్పించారు. మహారాష్ట్ర ప్రభుత్వం అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసింది. భారీ భద్రతను కల్పించింది.
శ్రీదేవికి ఇష్టమైన తెలుపు రంగు దుస్తుల్లో అందరూ తరలివచ్చారు. అంతిమయాత్ర రథాన్ని మల్లెపూలతో అలకరించారు. వాహనంలో మొహిత్ మార్వా, బోని కుమారుడు అర్జున్ కపూర్ తప్ప పెద్దగా ఎవరూ కనిపించలేరు.
అభిమానులు, ప్రముఖుల సందర్శనార్థం శ్రీదేవి పార్దీవదేహాన్ని లోకండ్‌వాలాలోని సెలబ్రేషన్స్ స్పోర్ట్స్ క్లబ్‌లో ఉంచారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత అక్కడి నుంచి అంతిమయాత్ర ప్రారంభమైంది.
లోకండ్‌వాలా నుంచి పవన్ హాన్స్ శ్మశాన వాటిక చేరుకోవడానికి గంటసేపు పట్టే అవకాశం ఉంది. శ్రీదేవి అంతిమయాత్ర వాహనం వెంట వేల మంది తోడువచ్చారు. దాంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ స్తంభించింది.
అంతిమయాత్రలో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. అయితే ఇంత హడావిడి జరుగుతున్నా గానీ బోనికపూర్ గానీ, జాహ్నవి, ఖుషీ కపూర్ కనిపించకపోవడం గమనార్హం.
శ్రీదేవి పార్దీవ దేహాన్ని దర్శించుకొన్న వారిలో సినీ ప్రముఖులు రజనీకాంత్, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, కమల్ హాసన్, రేఖ, హేమామాలిని, దీపికా పదుకొన్, షాహీద్ కపూర్, మాధురి దీక్షిత్, అక్షయ్ ఖన్నా, సోనమ్ కపూర్, టబు, జాక్వలైన్ ఫెర్నాండేజ్ తదితరులు ఉన్నారు

Recommended