Sridevi's Life Truths : బోనీ కపూర్‌ను ఎందుకు పెళ్లి చేసుకున్నానా అని బాధపడిందట ?

  • 6 years ago
Sridevi Uncle Venugopal Reddy about Sridevi's lost life. He reveals so many truths about her married life and her properties

శ్రీదేవి మద్రాసులో పుట్టి పెరిగినా ఆమె కుటుంబ మూలాలు తిరుపతిలోనే ఉన్నాయి. తిరుపతిలో ఆమెకు చాలా మంది బంధువులు ఉన్నారు. శ్రీదేవి మరణం నేపథ్యంలో ఆమె బాబాయ్ వేణుగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పలు సంచలన విషయాలు చెప్పుకొచ్చారు.
బోనీ కపూర్‌తో వివాహం శ్రీదేవి తల్లికి అసలు ఇష్టం లేదు. కానీ వారిద్దరూ ఆల్రెడీ కమిట్ అయ్యారు. అంతకు ముందు రెండు మూడు సార్లు బోనీ ఇంటికి వస్తే ఆమె కసిరి పంపివేసింది. శ్రీదేవి తల్లి మెదడు తప్పుడు ఆపరేషన్ వల్ల మతిస్థిమితం కోల్పోయింది, ఆమె సరిగా ఉంటు బోనీతో శ్రీదేవి పెళ్లి జరిగేది కాదేమో... అని వేణు గోపాల్ రెడ్డి తెలిపారు.
బోనీ కపూర్ బేనర్లో శ్రీదేవి సినిమా చేసే సమయంలో వారి మధ్య పరిచయం బలపడింది. శ్రీదేవి తల్లి అమెరికా ఆసుపత్రిలో ఉన్న సమయంలో బోనీ కపూర్ చేదోడు వాదోడుగా ఉన్నాడు. అప్పుడు వారి మధ్య కనెక్షన్ బాగా కుదిరింది.... అని వేణు గోపాల్ రెడ్డి తెలిపారు.
శ్రీదేవి అప్పుల మాట నిజమే. వాటి వల్ల మానసిక సంఘర్షణ పడేది. అవి ఆమె చేసిన అప్పులు కాదు. బోనీ కపూర్ సినిమాలు చేసి నష్టపోయాడు. ఆ డబ్బును శ్రీదేవి ఆస్తులు అమ్మి కవర్ చేశారు.... అని వేణు గోపాల్ రెడ్డి తెలిపారు.
ప్రేక్షకులు, ప్రపంచానికి తన బాధ తెలియకూడదని ఆమె ముఖంలో ఎప్పుడూ నవ్వు ఉంటుందే తప్ప... అది నిజమైన నవ్వు కాదు.... అని వేణు గోపాల్ రెడ్డి తెలిపారు.

Recommended