శ్రీదేవీ జీవితంలో కీలకఘట్టాలు...!

  • 6 years ago
Sridevi Boney Kapoor, the celebrated Bollywood actor whose contributions to Indian cinema won her a Padma Shri award, Passed Away of a massive cardiac arrest in Dubai on Saturday. She was 54. Along with her husband Boney and younger daughter Khushi, Sridevi had travelled to the emirate to attend actor Mohit Marwah's wedding.

బాలనటిగా కందన్ కరుణ్ సినిమాతో 1967లో సినిమాల్లోకి అరంగేట్రం చేసిన శ్రీదేవి.. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ సినిమాల్లో నటించారు. తెలుగులో పదహారేళ్ళ వయసు సినిమాతో హీరోయిన్‌గా అలరించారు. సుమారు ఐదు దశాబ్దాలుగా తన నటనతో, మరుపురాని పాత్రలతో ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు.
అందంతో ఆకట్టుకొంటూ శ్రీదేవి అనతికాలంలోనే అగ్ర కథానాయిక అని పేరు తెచ్చుకొన్నది. తన నటనా జీవితాన్ని బాలనటిగా కన్దన్ కరుణాయ్ (1967) అనే తమిళ చిత్రంతో మొదలు పెట్టిన అంచెలంచెలుగా ఎదిగింది. తొలుత తమిళ, మలయాళ చిత్రాలలో నటించారు. ఆ తర్వాత తెలుగులోకి ప్రవేశించారు. తెలుగు సినీ రంగాన్ని దాదాపు నాలుగు దశాబ్దాలకుపైగా శాసించారు.
మలయాళ చిత్రపరిశ్రమలో డైరెక్టర్ ఐవీ శశి దర్శకత్వంలోనే ఎక్కువగా నటించారు. ఆమె నటించిన ఆద్యపాదం, ఆలింగనము, కుట్టవుమ్ శిక్షయుమ్, ఆ నిమషం అనే చిత్రాలు ఆదరణ పొందాయి.
1976 లో బాలచందర్ చిత్రం "మూండ్రు ముదచ్చు"లో కమల్ హాసన్, రజనీ కాంత్ లతో కలిసి నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. చాలా కోణాలలో నుంచి పరిశీలిస్తే ఆ చిత్రం తమిళ చలన చిత్ర సీమకి పెద్ద గుర్తింపు తెచ్చింది. రజనీ కాంత్‌తో ధర్మయుద్ధం, ప్రియ, పొక్కిరి రాజా, టక్కర్ రాజా, అడుతా వారిసు, నాన్ అడిమై ఇల్లై మొదలగు చిత్రాలలో కలిసి నటించారు.
మూండ్రు ముదచ్చు చిత్రం రజనీకాంత్ సినీ జీవితంలో ఓ మైలురాయిగా నిలిచింది. . మూండ్రు ముడిచ్చు తర్వాత శ్రీదేవి పలు విజయవంతమైన చిత్రాల్లో నటించింది. కమల్ హాసన్‌తో ఆమె గురు, శంకర్‌లాల్, సిగప్పు రోజక్కల్. తాయుళ్లమాల్ నానిల్లై, మీండుం కోకిల, వాజ్వే మాయం, వరుమైయిన్ సిగప్పు, నీలా మలార్గల్, మూండ్రం పిరై, 16 వయత్తినిలే మొదలగు చిత్రాలలో నటించారు.
పదహారేళ్ల వయసుతో శ్రీదేవి తెలుగు సినిమా రంగంలోకి ప్రవేశించింది. కొద్దికాలంలోనే అగ్రశ్రేణి హీరోయిన్‌గా మారింది. దాదాపు అందరు అగ్ర కథానాయకులతో కలసి నటించింది. ఆమె ఎక్కువగా కే రాఘవేంద్రరావు దర్శకత్వంలోనే నటించారు. ఎన్.టి.రామారావుతో కొండవీటి సింహం, వేటగాడు, సర్దార్ పాపారాయుడు, బొబ్బిలిపులి మొదలగు చిత్రాలలో నటించారు.

Recommended