పెళ్లి తరువాత ఏం జరుగుతుంది?

  • 6 years ago
Ye Maya Chesave sequel on cards. Gautham Menon preparing story for sequel.

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ ప్రేమ జంటలలో నాగ చైతన్య, సమంత మొదటి వరుసలో ఉంటారు. ఏం మాయ చేసావే చిత్రంతో ప్రొఫెషనల్ గా కలసిన ఈ జంట గత ఏడాది వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఏళ్ల తరబడి సాగిన వీరి ప్రేమ కథ విజయవంతం అయింది. వీరి ప్రేమకు బీజం పడింది మాత్రం ఏ మాయ చేసావే చిత్రంతోనే. ఆ చిత్రంలో సమంత, చైతు మధ్య కెమిస్ట్రీ యువతని ఉర్రూతలూగించింది. ఏకంగా ముద్దు సన్నివేశలతో సంచనలం సృటించారు. మరో మారు ప్రేక్షకులకు ఆ అనుభూతిని కలిగించడానికి రంగం సిద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏ మాయ చేసావే చిత్రానికి సీక్వెల్ సిద్ధం అవుతోందంటూ వస్తున్న వార్తలు ఆసక్తి కలిగిస్తున్నాయి.
ఈ చిత్రం సమంతకు డెబ్యూ మూవీ. నాగచైతన్యకు రెండవ చిత్రం. చైతూకు తొలి సక్సెస్ దక్కింది మాత్రం ఈ చిత్రంతోనే.
ఏ మాయ చేసావే చిత్రంలో చైతు, సమంత మద్య రొమాంటిక్ సన్నివేశాలకు యువత ఫిదా అయిపోయారు. ఆ చిత్రంలో ఈ జంట కెమిస్ట్రీ అదిరిపోయిందనే కాంప్లిమెంట్స్ వినిపించాయి.
సమంత, చైతు మ్యాజిక్ మనం చిత్రంలో కూడా బాగా పనిచేసింది. ఆటోనగర్ సూర్య చిత్రంలో కూడా సమంత, చైతు మెరిశారు. కానీ మనం చిత్రం మాత్రం ఓ క్లాసికల్ హిట్ గా నిలిచింది.
నాగ చైతన్య హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మంచి అవకాశాలతో రాణిస్తున్నాడు.
సమంత సౌత్ లో క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్యూట్ హీరోయిన్ ఆన్ స్క్రీన్ పై చేసే మాయ అంతా ఇంతా కాదు. కేవలం సమంత పెర్ఫామెన్స్ తో గట్టెక్కిన చిత్రాలు ఉన్నాయి.

Recommended