మర్మాంగంపై ఓంకారం ప్లే చేయడం చాలా దారుణం

  • 6 years ago
The filmmaker, whose controversial movie with American star Mia Malkova hit the internet last month, appeared before the officials of Central Crime Station (CCS) in response to the notice served on him. In this situation, writer Jaya kumar rises objection on MM Keeravani music

గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ (జీఎస్టీ) సినిమాలో నటి మియా మాల్కోవా మర్మాంగంపై ఓంకారం ప్లే చేయడం చాలా దారుణం. శ్రీ రామదాసు, అన్నమయ్య, షిర్డి సాయిబాబా లాంటి చిత్రాలకు కీరవాణి సంగీతం అందించారు. ఆయనంటే నాకు చాలా ఇష్టం. డబ్బు కోసం పోర్న్ సినిమాలో నటించే మియా మాల్కోవా చిత్రానికి కీరవాణి సంగీతం అందించడం చాలా బాధకరం అని అన్నారు సినీ రచయిత జయ కుమార్.
సాధారణంగా ఓంకారం అనేది చాలా పవిత్రం. అలాంటి పవిత్రమైన ఓంకారాన్ని మియా మర్మాంగంపై చూపించారు. మనం గుడికి వెళ్లినప్పుడు మియా మాల్కోవా లాంటి సన్నివేశాలు గుర్తుకు వస్తే ఎంత దారుణంగా ఉంటుందో తలచుకొంటేనే బాధగా ఉందన్నారు.
భక్తికి సంబంధించిన మ్యూజిక్‌ను సెక్స్ కోసం వాడుకోవడం చాలా దారుణం. కీరవాణి మ్యూజిక్‌ను ప్రశంసిస్తూ వర్మ ట్వీట్ చేయడం కూడా అన్యాయం అని జయకుమార్ అన్నారు.
జీఎస్టీ ఓపెనింగ్ షాట్‌లోనే ఓంకారం వినిపిస్తుంది. అది ఓంకారం కాదు అని అబద్దాలు అడే అవకాశం ఉంది. కచ్చితంగా అది ఓంకారమే అనేది స్పష్టమవుతుంది.
సెక్స్ మూవీని తీసి ఓ కళాత్మక చిత్రం అని చెప్పుకోవడం ఇంకా దారుణమే. ఈ చిత్రాన్ని దేశం మొత్తం అసహ్యించుకొంటున్నది. ఇలాంటి వారిని వదిలేస్తే మియా మాల్కోవాకు గుడి కడుతారు అని అన్నారు.
జీఎస్టీ సినిమాను యూరప్‌లో తీశానని వర్మ చెబుతున్నారు. అలాంటి సినిమాకు కీరవాణి ఎక్కడ మ్యూజిక్ కొట్టాడు? కొడితే తన ఇంట్లో నాలుగు గోడల మధ్య కొట్టాడా? లేక ప్రొడక్షన్ హౌస్‌లో కొట్టాడా అనే విషయంపై కీరవాణి క్లారిటీ ఇవ్వాలి అని జయకుమార్ డిమాండ్ చేశారు.
నేను అందించిన స్క్రిప్టును వర్మ వాడుకోవడాన్ని పక్కన పెడితే.. వర్మ, కీరవాణి హిందూ మతానికి సంబంధించిన మనోభావాలను కించపరిచారని, వీళ్లకు సరైన బుద్ది చెప్పాల్సిందేనని, తను విశ్వహిందూ పరిషత్‌ను సంప్రదిస్తానని , పోలీసులకు కూడా సమాచారం అందిస్థానన్నారు జయ కుమార్ .

Recommended