తొలిప్రేమ ఆఫర్ ని మిస్ చేసుకున్న హీరోయిన్

  • 6 years ago
నాని హీరోయిన్ అంతా అయిపోయాక మేల్కొంది. ఆమె నిర్లక్ష్యం విలువ ఓ సూపర్ హిట్ చిత్రం. మనం చేసే కొని మిస్టేక్స్ వలన జీవితం మొత్తం భాదపడక తప్పదు. హీరోయిన్ మెహ్రీన్ పరిస్థితి ఇదే. నాని నటించిన కృష్ణగాడి వీర ప్రేమ గాధ చిత్రంతో మెహ్రీన్ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చింది. అల్లరి పిల్లగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ చిత్రం తరువాత మెహ్రీన్ కు వరుసగా అవకాశాలు అందాయి. తన బరువు కారణంగా మెహ్రీన్ తొలిప్రేమ చిత్రంలో నటించే అవకాశం కోల్పోయిందనే వార్త చర్చనీయాంశంగా మారింది.
కృష్ణ గాడి వీర ప్రేమ గాధ చిత్రంతో తొలి హిట్ ని ఖాతాలో వేసుకున్న మెహ్రీన్ ఆ తరువాత రాజా ది గ్రేట్, మహానుభావుడు వంటి చిత్రాలతో వరుస హిట్లు అందుకుంది.
మెగా హీరో సాయిధరమ్ తేజ్ సరసన నటించిన జవాన్ చిత్రం నిరాశ కలిగించింది. కానీ ఆ చిత్రంలో మెహ్రీన్, తేజు మధ్య కెమిస్ట్రీ యువతని ఆకర్షించింది.
మెహ్రీన్ తొలిప్రేమ లో నటించే గోల్డెన్ ఆఫర్ ని మిస్ చేసుకుంది. దానికి కారణం ఆమె కాస్త బొద్దుగా కనిపించడమే అని టాక్. మొదట దర్శకుడు వెంకీ అట్లూరి ఈ చిత్రం కోసం మెహ్రీన్ ని సంప్రదించారట. కానీ ఆమె బొద్దుగా కనిపించడంతో ఆ ఆలోచనని విరమించుకున్నట్లు తెలుస్తోంది.
మెహ్రీన్ మొదటి నుంచి తన ఫిజిక్ దృష్టిపెట్టినట్లు కనిపించలేదు. కృష్ణగాడి వీరప్రేమ గాధ చిత్రంలో లంగాఓణిలో మ్యానేజ్ చేసింది. కానీ రాజా ది గ్రేట్, మహానుభావుడు చిత్రాల్లో మెహ్రీన్ బొద్దుగా కనిపించిందని కామెంట్స్ వచ్చాయి.
తొలిప్రేమ నటించే అవకాశాన్ని చేజేతులా చేజార్చుకున్న మెహ్రీన్ జీవితాంతం భాదపడక తప్పదు. తొలిప్రేమ చిత్రం సాధించిన విజయం అలాంటిది మరి. యువత మధ్య ప్రధానంగా తొలిప్రేమ చిత్రం గురించే చర్చ జరుగుతోంది.

Recommended