తమన్ దే భాద్యత : ఇది పోతే ఇక అంతే!

  • 6 years ago
Thaman bags another crazy project. Thaman Confirms Ravi Teja & Sreenu Vaitla Movie

సంగీత దర్శకుడు తమన్ కెరీర్ పరంగా ఇప్పుడు పీక్స్ లో ఉన్నాడు. ఇటీవల తమన్ సంగీతం అందించిన చిత్రాలు వరుసగా విజయం సాధిస్తున్నాయి. లేటెస్ట్ గా తమన్ మరో క్రేజీ ప్రాజెక్ట్ కు సంగీతం అందించే ఛాన్స్ కొట్టేశాడు. ప్లాపుల్లో ఉన్న శ్రీనువైట్ల, పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్న రవితేజ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడిగా ఎంపికయ్యాడు. వీళ్ళిద్దరూ తమన్ పైనే భారం వేయడం విశేషం.
అద్భుతమైన ఫామ్ తో తమన్ తన సంగీతంతో చెలరేగిపోతున్నారు. వరుసగా తమన్ ని క్రేజీ ఆఫర్ లు పలకరిస్తున్నారు. చేతి నిండా చిత్రాలు ఉన్నాయి.
తమన్ సంగీతం అందించిన భాగమతి, తొలిప్రేమ రెండు చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. తొలిప్రేమ అయితే ఘనవిజయం దిశగా దూసుకునిపోతోంది.
తమన్ చేతినిండా ప్రస్తుతం సినిమాలు ఉన్నాయి. నితిన్ నటించిన ఛల్ మోహన్ రంగ చిత్రానికి కూడా తమనే సంగీత దర్శకుడు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్ తోనే తమన్ హవా మొదలైంది. టీజర్ లో అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ సంగీతంతో అలరించాడు. ఇక మంచు విష్ణు ఆచారి అమెరికా యాత్ర చిత్రానికి కూడా తమన్ స్వరాలు సమకూరుస్తున్నాడు.
కాగా శ్రీనువైట్ల మరియు రవితేజ ఇద్దరూ కెరీర్ పరంగా కష్టాల్లో ఉన్నారు. శ్రీనువైట్ల పరిస్థితి అయితే మరి దయనీయంగా ఉంది. ఆగడు చిత్రం నుంచి శ్రీనువైట్ల దర్శకత్వంపై విమర్శలు మొదలయ్యాయి.
శ్రీనువైట్ల కమర్షియల్ చిత్రాలని కామెడీ ఎంటర్ టైనర్ లుగా మలచడంలో దిట్ట. రవితేజ కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీనితో ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. సినిమాకు సంగీతం కీలకం కాబట్టి తమన్ పైనే వీరు ఆశలు పెట్టుకున్నారు.

Recommended