ఇక్కడ మగాడు ఎవరు? : హీరో తో ఆడుకున్న హీరోయిన్లు!

  • 6 years ago
AWE Movie Team Nani, Kajal, Nitya menon Super Funny Interview. The film featuring Kajal Aggarwal, Nithya Menen, Regina Cassandra, Eesha Rebba.And Directed by Prasanth Varma, Music is composed by Mark K Robin, Produced by Prashanti Tipirneni


హీరో నాని నిర్మాతగా మారి చేస్తున్న ఫస్ట్ ప్రాజెక్ట్ 'అ!'. కాజల్, నిత్యా మీనన్, రెజీనా, ఈషా రెబ్బ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి నాని కేవలం నిర్మాతగా వ్యవహరించడం మాత్రమే కాదు ఇందులో చేప పాత్రకు వాయిస్ ఓవర్ కూడా ఇస్తున్నారు. ఫిబ్రవరి 16న ఈ చిత్రం విడుదలవుతున్న నేపథ్యంలో ఈ నలుగురు భామలతో పాటు నిర్మాత నాని ప్రమోషన్లలో బిజీ అయ్యారు. ఇటీవల నిర్వహించిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ చాలా ఫన్నీగా సాగింది.
ఇంటర్వ్యూ ప్రారంభం సందర్భంగా యాంకర్ మాట్లాడుతూ... ఇంత మంది బ్యూటిఫుల్ లేడీస్‌ ఒకే ఫ్రేములో కనిపించడం హ్యాపీగా ఉందని వ్యాఖ్యానించారు. ‘నన్ను మీరు పట్టించుకోవడం లేదు' అని నాని అనడంతో... యాంకర్ స్పందిస్తూ ‘ఇక్కడున్న లేడీస్‌ను మాత్రమే పలకరించాను, ప్రొడ్యూసర్ వరకు ఇంకా రాలేదు అంటూ సమాధానం ఇచ్చారు. వెంటనే నిత్యా మీనన్ కల్పించుకుని.... ఇక్కడ మగవాడు ఎవరున్నారు? అంటూ సెటైర్ వేశారు. దీనికి నాని బుంగమూతి పెట్టేశారు.
అయితే నాని కాస్త ఫీలైనట్లు బుంగ మూతి పెట్టి లేచి పోవడానికి ట్రై చేశాడు. దీంతో నిత్యా మీనన్ స్పందిస్తూ..... అరేయ్ నాని నిన్ను కాదురా, నా మాటల అర్థం యాక్టర్స్‌ అని... నువ్వు ఈ సినిమాకు ప్రొడ్యూసర్ కదరా.... అంటూ కామెంట్ చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.
నాని, నిత్యా మీనన్ మధ్య ఎంత క్లోజ్ ఫ్రెడ్షిప్ ఉందో నిత్యా మీనన్ మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో యాంకర్‌తో కలిపి అంతా లేడీసే ఉండటంతో ఇంటర్వ్యూ సాగినంత సేపు నాని ని ఓ ఆట ఆడేసుకున్నారు.