• 6 years ago
Director Ramgopal Varma tweeted on Andhra pradesh MP's over their behaviour in Parliament about ap Poll Promises, varma saying that TDP MP's are far lesser than jokers

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఏపీ ఎంపీ శివప్రసాద్ చేసిన హంగామా అందరికీ ఓవరాక్షన్ లాగే అనిపించింది. అంతకుమించి వెగటు కూడా పుట్టించింది. నిరసన అంటే కేంద్రం నుంచి స్పందన వచ్చేలా ఉండాలి కానీ.. 'ఛీ' అనిపించుకునేలా ఉంటే ఎలా అన్న విమర్శలూ వచ్చాయి. సహజంగానే వ్యంగ్యాస్త్రాలను ఎక్కుపెట్టే ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇప్పుడు దీనిపై కూడా తనదైన శైలిలో స్పందించారు..
'ఆశ్చర్యమేమి లేదు.. గొప్ప ప్రజానీకం ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు జోకర్స్ లాంటి వ్యక్తులు ప్రాతినిధ్యం వహిస్తుంటే ఏపీని మోడీ కూడా ఒక జోక్‌లా భావించి ఉంటాడు. వీళ్లు జోకర్స్‌కు తక్కువ కానీ డ్యాష్...డ్యాష్..కి ఎక్కువ' అంటూ ట్వీట్ చేశాడు వర్మ.
టీడీపీకి చెందిన ఈ ఎంపీలు అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రతిష్టలు ఉన్న తెలుగు దేశం పార్టీ పరువును జాతీయ స్థాయిలో పరువు తీస్తున్నారు..' అంటూ వెటకారంగా మరో ట్వీట్‌ చేశారు వర్మ
మిగతా ఎంపీలంతా హుందాగా నిరసన తెలుపుతుంటే.. ఎంపీ శివప్రసాద్ మాత్రం దేవుడు పూనిన వ్యక్తి లాగా, జుట్టు ఈరబోసుకుని హంగామా చేయడం చాలామందికి చికాకు కలిగించింది. ముఖ్యంగా దళితుల్లో ఆయన పట్ల చాలా విమర్శలు వస్తున్నాయి. హుందాగా నిరసన తెలపాల్సిందిపోయి.. దళిత ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఎంపీ శివప్రసాద్ నాటకాలడుతున్నారని విమర్శిస్తున్నారు.
బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఏపీ విభజన హామిలపై టీడీపీ ఎంపీలు పెద్ద ఎత్తున నిరసన తెలియజేసిన సంగతి తెలిసిందే. సభలోనూ, బయటా నిరసనలతో హోరెత్తించారు. కేంద్రం దిగిరాకపోతే తెగదెంపులే అన్న సంకేతాలు పంపించారు. టీడీపీ ఎంపీల నిరసనల మధ్యనే సభ మార్చి 5వ తేదీకి వాయిదా పడింది. ఇప్పటికీ కేంద్రం రాష్ట్రానికి చాలా చేశాం అంటూనే ఉంది తప్ప.. కొత్తగా చెప్పింది గానీ చేసేది కానీ ఏం చెప్పకపోవడం గమనార్హం.

Category

🗞
News

Recommended