Goddess in Salwar Kameez, WhatsApp Photo Went Viral

  • 6 years ago
According to reports, Raj, who'd joined the temple service six months ago to help his father, decorated goddess Abhayambal, the presiding deity of the temple, in salwar kameez - a traditional outfit from north India. In a strange series of events, the temple priest from Mayiladuthurai’s Mayuranathaswami temple has been removed from service following a WhatsApp photo that went viral.

తమిళనాడు లోని మయిలాడుతురై యొక్క మయూరనాథస్వామి ఆలయం లో ఒక వింతైన సంఘటన చోటు చేసుకుంది. డానికి సంభదించిన ఒక వాట్సాప్ ఫోటో ట్రోల్ అయిన తరువాత ఆ ఆలయ పూజారిని సేవల నుండి తొలగించారు. అయితే అసలు ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే రాజ్ అనే వ్యక్తి 6 నెలల క్రితం తన తండ్రికి సహాయం చేసేందుకు మయూరనాథస్వామి ఆలయం లో పనికి కుదిరాడు, అతని తండ్రి పూజారి.
కాగా ఆ గుడిలోని దేవత పేరు అభయంబల్. దేవాలయానికి చెందిన దేవత అభయంబల్ ని అలంకరించే నేపధ్యంలో చీరతో కాకుండా ఉత్తరప్రదేశ్కు చెందిన సాంప్రదాయ దుస్తులయిన సల్వార్ కమీజ్ తో అభయంబల్ దేవతని అలంకరించాడు రాజ్.
అయితే అది చూసిన భక్తులు ఆగ్రహానికి గురయ్యారు. 1000 ఏళ్ల విగ్రహం యొక్క "పవిత్రత" అటువంటి ప్రదర్శన కారణంగా పోయిందని అతనితో ఘర్షణ పడ్డారు.
ఇక ఈ విషయమై ఆలయ నిర్వాహకుడు గణేశన్ మాట్లాడుతూ ఆలయం అధికారులు తక్షణమే అతని మరియు అతని తండ్రిని తొలగించాలని నిర్ణయించుకున్నారు అని చెప్పారు. అలాగే శుక్రవారం శుక్రవారం అభయంబల్ దేవత గంధము తో అలంకరించబడుతుంది అని కానీ ఈ సారి సాంప్రదాయానికి వ్యతిరేకంగా వెళుతూ, రాజ్ సల్వార్-కమీజ్-దుపట్టాలో దేవత ని చూపించాలని నిర్ణయించుకున్నాడు అని గణేశన్ వివరించారు. అయితే వాళ్ళు తమ "పొరపాటు" గ్రహించకుండా, తిరిగి దేవత ఫోటోను వాట్సాప్ లో షేర్ చెయ్యడంతో గొడవ ఇంకా పెద్దది అయిందని వివరించారు.

Recommended