Sai Dharam Tej Next Movie With A Crazy Director

  • 6 years ago
Mega hero Saidharam Tej finalised one more movie. Chandra Shekhar Yeleti narrated story to Tej and the project will materialised soon. Chandra Sekhar Yeleti has ventured so many experimental scripts for the Telugu audience.

మెగా మేనల్లుడిగా సాయిధరమ్ తేజ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. మేనమామలు చిరంజీవి, పవన్ కళ్యాణ్ ల పోలికలే కాదు వారిలోని ఎనర్జీని సైతం తేజు వారసత్వంగా పొందాడు. కెరీర్ ఆరంభంలో వరుస హిట్లు కొట్టిన తేజు ఆ తర్వాత ప్లాప్ లని చవి చూశాడు. తిక్క, విన్నర్, నక్షత్రం మరియు జవాన్ చిత్రాలన్నీ నిరాశపరిచాయి. కానీ ఆ ప్రభావం తేజు కెరీర్ పై పడకపోవడం ఆశ్చర్యకరమే. వరుస సినిమాలతో బిజీగా మారుతున్న సాయిధరమ్ తేజ్ మరో ప్రతిభగల దర్శకుడికి కమిట్ అయినట్లు తెలుస్తోంది.
విభిన్న చిత్రాలతో చంద్రశేఖర్ ఏలేటి ప్రతిభ గల దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కమర్షియల్ చిత్రాలకు భిన్నంగా ఆయన చిత్రాలు ఉంటాయి. తాజాగా చంద్రశేఖర్ ఏలేటి సాయిధరమ్ తేజ్ ని కలసి కథ వినిపించాడట. అందులో తేజు కోసం ఏలేటి సరికొత్త పాత్రని డిజైన్ చేసాడట. తన క్యారక్టరైజేషన్ నచ్చడంతో తేజు వెంటనే ఒకే చెప్పేసినట్లు తెలుస్తోంది.
సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం ప్రేమ కథల స్పెషలిస్ట్ కరుణాకరన్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. కరుణాకరన్ దర్శకత్వంలో నటిస్తున్న మూడవ మెగా హీరో సాయిధరమ్ తేజ్ కావడం విశేషం. గతంలో కరుణాకరన్ పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ ని డైరెక్ట్ చేశాడు.
వరుసగా ప్లాపులు ఎదురవుతున్నా తేజు చిత్రాల జోరు మాత్రం ఆగడం లేదు. వరుసపెట్టి సినిమాలు చేసేస్తున్నాడు. మేనమామల పోలికలతో ఎంట్రీ ఇచ్చిన తేజు డాన్సులు, నటన పరంగా మెగా ఫాన్స్ కు బాగా కనెక్ట్ అయ్యాడు. ప్రేమ కథలు, వినోదాత్మక కథలు అన్ని రకాలపాత్రలకు తేజు బాడీ లాంగ్వేజ్ సరిపోతుండడంతో దర్శకులంతా ఈ మెగా హీరో వెంట పడుతున్నట్లు తెలుస్తోంది.

Recommended