Chiranjeevi Rejected Dhanush

  • 6 years ago
Dhanush getting ready with second direction ventures. report states that Dhanush had approached Chiranjeevi for the same role. However, Chiranjeevi couldn’t allot bulk dates for the project and had backed out. If Nagarjuna gives his nod to the film, this will be a collaboration to look out for.

విలక్షణ నటుడు ధనుష్ వరుస చిత్రాలతోనే కాదు.. దర్శకత్వం పరంగా కూడా దూసుకెళ్తున్నాడు. త్వరలోనే ధనుష్ నటించిన హాలీవుడ్ చిత్రం కూడా రిలీజ్‌కు సిద్ధమవుతున్నది. త్వరలోనే తన దర్శకత్వం చేపట్టి రెండో చిత్రాన్ని రూపొందించేందుకు సిద్దమవుతున్నాడు. అయితే ఈ చిత్రంలో టాలీవుడ్ మన్మథుడు నాగార్జున నటిస్తున్నారనే వార్త వైరల్‌గా మారింది.
ధనుష్ తన హాలీవుడ్ చిత్రం ది ఎక్ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్ సినిమాను పూర్తి చేశాడు. కెన్ స్కాట్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ద్వారా హాలీవుడ్‌కు పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. రొమేనియన్ ప్యూర్టోలాస్ రచించిన ది ఎక్ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్ హూ గాట్ ట్రాప్డ్ ఇన్ యాన్ ఐకియా వార్డ్‌రోబ్ అనే పుస్తకం ఆధారంగా రూపొందుతున్నది.
ప్రస్తుతం మారీ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి బాలాజీ మోహన్ దర్శకుడు. ఈ చిత్ర పూర్తి కాగానే తన రెండో దర్శకత్వపు సినిమాపై దృష్టి పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు
శ్రీ తేండ్రల్ ఫిల్మ్స్ బ్యానర్‌పై రూపొందే సినిమాకు ధనుష్ దర్శకత్వం వహించను్నారు. ఈ చిత్రంలో నాగార్జున అక్కినేని ఓ కీలకపాత్రను పోషించనున్నారనేది కోలీవుడ్ సమాచారం.
తన రెండో డైరెక్షన్ ప్రాజెక్ట్ కోసం తొలుత చిరంజీవిని సంప్రదించారనట. అయితే ఎక్కువ రోజులు ఈ సినిమాకు కేటాయించలేనని అశక్తతను వ్యక్తం చేయడంతో ధనుష్ ఆ ప్రయత్నాన్ని మార్చుకొన్నాడు. ఇటీవల ధనుష్ పవర్ పాండీ అనే చిత్రానికి ధనుష్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.

Recommended