'బాహుబలి'లో ఆ బీజీఎం కాపీ నా ?

  • 6 years ago
There are alleged rumours that Tollywood music director MM Keeravani's BGM in Bahubali is copy of ANR's old movie Keelugurram.

కథలే కాదు.. టాలీవుడ్‌లో మ్యూజిక్ కూడా కాపీయేనా?.. అసలే అతికొద్ది మంది సంగీత దర్శకులను కలిగి ఉన్న టాలీవుడ్.. ఇప్పుడు మ్యూజిక్ విషయంలోనూ పరువు పోగొట్టుకుంటుందా?.. తెలుగులో దిగ్గజ సంగీత దర్శకుల్లో ఒకరిగా చెప్పుకునే ఎంఎం కీరవాణి పేరు కూడా ఇప్పుడు కాపీ క్యాట్ జాబితాలోకి ఎక్కేసింది. ఇంతకీ ఆయనేం కాపీ చేశారు..
'బాహుబలి'.. తెలుగు ప్రపంచం గర్వించదగ్గ గొప్ప సినిమా అని ఇండస్ట్రీ అంతా దాని గురించి గొప్పగా చెప్పుకుంటున్న సందర్భమిది. ప్రపంచ స్థాయితో పోల్చుకునేంత గొప్ప సినిమా ఏమి కాదన్న వాదన కూడా లేకపోలేదనుకోండి. సరే, ఇదంతా పక్కనపెడితే.. ఆ సినిమా కోసం పనిచేసిన టెక్నీషియన్స్ గురించి.. వాళ్ల టాలెంట్ గురించి అంతా ప్రశంసిస్తూనే ఉన్నారు. ఇలాంటి తరుణంలో కీరవాణిపై 'కాపీ' ఆరోపణలు గుప్పుమంటున్నాయి.
బాహుబలిలో ఓ సీన్ కోసం అక్కినేని నాగేశ్వరరావు నటించిన 'కీలుగుర్రం' బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ను కీరవాణి వాడుకున్నారనేది ఆయనపై వస్తున్న ఆరోపణ. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తోంది. 'కీలుగుర్రం' బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌నే కాస్త మార్చేసి కీరవాణి బాహుబలిలో దించారని అంటున్నారు.
కాస్త దగ్గరి ఛాయలు ఉన్నంత మాత్రానా కాపీ కొట్టేశాడంటే ఎలా? అనేవారు లేకపోలేదు. కీలుగుర్రం నుంచి కీరవాణి స్ఫూర్తి పొంది ఉండవచ్చు అంటున్నారు. కీలుగుర్రం బీజీఎంకు, బాహుబలి బీజీఎంకు కాస్త తేడా ఉందని అంటున్నారు.
గతంలో ఛత్రపతి సినిమా బీజీఎం విషయంలోనూ కీరవాణిపై విమర్శలు వచ్చాయి. ఓ జపాన్ సినిమా నుంచి బీజీఎం ట్రాక్ ఎత్తుకొచ్చేసి.. ఉన్నది ఉన్నట్లుగా దించేశారన్న టాక్ వినిపించింది. ఆ వీడియోలు కూడా ఇప్పటికీ యూట్యూబ్ లో ఉన్నాయి.

Recommended