• 6 years ago
Pawan Kalyan Gets Insulted By Fans at Dharmavaram Meet. Pawan Emotional Warning To Fans Not To Shout.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ యాత్రలు చేస్తున్న సంగతి తెలిసిందే. సినిమాలను పూర్తిగా వదిలేస్తున్నట్లు చెప్పిన ఆయన ఇకపై సీరియస్‌గా రాజకీయాల్లో కొనసాగాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో పవర్ స్టార్ సోమవారం అనంతపురంలో పర్యటించారు.
అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ ధర్మవరంలోని చేనేత కార్మికులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన్ను చూసేందుకు అభిమానులు కూడా భారీగా తరలి వచ్చారు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌ రాజకీయ నాయకుడిగా అక్కడికి వచ్చినప్పటికీ ఆయనలో ఫ్యాన్స్ తాము అమితంగా అభిమానించే నటుడినే చూశారు. ఆయన్ను చూడగానే ఆనందంతో పరవశించి పోయి అరుపులు, కేకలు వేశారు.
సమస్యల గురించి తెలుసుకోవడానికి వస్తే అభిమానులు అరుపులు, కేకలు వేయడంతో పవన్ కళ్యాణ్ ఇబ్బంది పడ్డారు. దీంతో అసహనానికి గురైన ఆయన వారిని సుతిమెత్తగా మందలించారు.
మీరు అరుపులు అరిస్తే అది నాకు అవమానం తప్ప సంతోషం కాదు. మీరు నేను చెప్పేది వినాలి. అరుపులకు, కేకలకు, ఉత్సాహానికి ఓ సమయం ఉంటుంది.... అంటూ పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మన ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే అరుస్తామా? బాధలతో ఉన్నపుడు వారి బాధలను వినడం నేది సంస్కారం. కొంచెం ఓపికతో, సహనంతో ఉండండి... అంటూ పవర్ స్టార్ హెచ్చరించారు.

Recommended