పిచ్చి దర్శకుడు అంటూ.. వర్మపై కీరవాణి ట్వీట్..!

  • 6 years ago
Music Director MM Keeravani responded on Ramgopal Varma's GST. Keeravani said Love RGVzoomin for uplifting my music in the process of showcasing his brilliance in various kinds of celluloid aesthetics.

రాంగోపాల్ వర్మ 'గాడ్ సెక్స్&ట్రూత్' సినిమాకు కీరవాణి సంగీతం అనగానే చాలామంది ఆశ్చర్యపోయారు. కీరవాణి ఒక బూతు సినిమాకు సంగీతం అందించడమేంటి? అని చాలామంది నోరెళ్లబెట్టారు. అయితే తాను చెప్పిన కథలోని ఇంటెన్సిటీ, తాత్వికతను అర్థం చేసుకున్నందువల్లే కీరవాణి ఈ ప్రాజెక్ట్ ఒప్పుకున్నారని వర్మ తెలిపిన సంగతి తెలిసిందే. తాజాగా వర్మను పిచ్చి దర్శకుడు అంటూ కీరవాణి ట్విట్టర్ లో ట్వీట్ చేయడం గమనార్హం.
సెల్యులాయిడ్‌పై పలు రకాల భావాలను పలికించే ఆయన బ్రిలియెన్స్ నా సంగీతాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాయి. 1991లో రొమాన్స్‌ను, 92లో కామెడీని, 2018లో సెక్స్‌కు సంగీతం అందించాను. ఈ సంవత్సరంలో ఆయన తీయనున్న హారర్, వయొలెన్స్ చిత్రాలకు సంగీతం అందించబోతున్నా. నన్ను నమ్మిన పిచ్చి దర్శకుడికి థాంక్స్.
తెలుగులో తన రెండో సినిమా క్షణ క్షణం(1991) నుంచే కీరవాణితో జర్నీ మొదలుపెట్టారు వర్మ. ఆ తర్వాత అంతం(1992) సినిమాకు ఇద్దరు కలిసి పనిచేశారు. మళ్లీ ఇన్నేళ్లకు వీరిద్దరి కలయికలో 'జీఎస్‌టీ' వచ్చింది.
బాహుబలి తర్వాత కీరవాణి కాస్త గ్యాప్ తీసుకున్నారు. 'దిక్కులు చూడకు రామయ్య' ఫేం త్రికోటి దర్శకత్వంలో రంజిత్, పలక్ లల్వాని జంటగా తెరకెక్కుతున్న సినిమా 'జువ్వ' సినిమాకు ఆయన సంగీతం అందించారు. సినిమాలో 'ఓ కల' అంటూ సాగే మెలోడి సాంగ్‌ లిరికల్‌ వీడియోను ఆదివారం రిలీజ్ చేశారు.

Recommended