‘భాగమతి’ చిత్రంపై మహేష్ కత్తి రివ్యూ....!

  • 6 years ago
Kathi Mahesh Review on BHAAGAMATHIE Movie. Lady Oriented Movie BHAGAMATHIE is getting Positive Talk.Anushka Role Is The Main Asset For the movie.

ఒకప్పుడు కొద్ది మందికి మాత్రమే తెలిసిన ఫిల్మ్ క్రిటిక్ మహేష్ కత్తి.... పవన్ కళ్యాణ్ అభిమానులతో వివాదం తర్వాత బాగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఆయన చెప్పే సినిమా రివ్యూలపై ఆసక్తి చూపే వారి సంఖ్య పెరిగింది. మరి తాజాగా విడుదలైన అనుష్క 'భాగమతి' చిత్రంపై మహేష్ కత్తి రివ్యూ ఎలా ఉందో ఓ సారి లుక్కేద్దాం.
‘భాగమతి' టైటిల్ అనౌన్స్ చేసినపుడు అంతా ఇది హైదరాబాద్ చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా అనుకున్నారు. కానీ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఇదో హారర్ ఫిల్మ్ అని అందరికీ అర్థమైంది. థియేటర్‌కు వెళితే ఒక పొలిటికల్ థ్రిల్లర్‌గా మొదలై ఆపై హారర్‌గా పరిణాంతరం చెంది అంతే ఎంగేజింగ్ ఎండింగ్‌తో కన్విన్సింగ్‌గా ముగిసింది అని మహేష్ కత్తి తెలిపారు.
కథ, కథనాలు, రచన పరంగా దర్శకుడు అశోక్ చేసిన విన్యాసాలు అందరినీ కట్టిపడేసేలా చేశాయి. ఇది పూర్తిగా రైటర్స్ ఫిల్మ్. రచన పరంగా అంతే స్థాయిలో ఆకట్టుకోవడం, ప్రతీ సీన్లోనూ ఓ ట్విస్టు. దాన్ని అంతే స్థాయిలో రంజింప చేయగలుగడం ఈ సినిమా యొక్క బలం.... అని మహేష్ కత్తి తెలిపారు.
ఒక కొత్తరకమైన కథ ఇది. పొలిటికల్ థ్రిల్లర్ మూవీని హారర్ థ్రిల్లింగ్ అంశాలతో మిక్స్ చేయడం కష్టం. కానీ దాన్ని ఎలా మిక్స్ చేశారు? ఏ విధమైన నేరేటివ్ స్ట్రక్చర్‌తో దీన్నికన్విన్స్ చేశారు అనేది తెరపై చూడాల్సిందే.
అనుష్క సౌత్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్ట్రెస్ అని మరోసారి నిరూపించుకుంది. ఈ సినిమాలో తన పాత్రలో మమేకమై నటించింది. జయరాం, ఆశా మలయాళం నటులు అయినప్పటికీ ఒక వినూత్నాన్ని ఈ సినిమాకు తీసుకొచ్చారు. రెగ్యులర్ గా ఎవరినైనా పెడితే ఆ ఫ్రెష్ నెస్ వచ్చుండేది కాదేమో. మురళీ శర్మ తనదైన నటనతో మరోసారి ఆకట్టుకున్నారు. కమెడియన్ ధనరాజ్, ప్రభాస్ శ్రీను ప్రధమార్థంలో కొంత వరకు ఎంటర్టెన్మెంట్ అందించారు.... అని మహేష్ కత్తి తెలిపారు.

Recommended