ప్రభాస్‌తో పెళ్లి.. పూరీ జగన్నాథ్ సలహాతోనే మారిపోయా!

  • 6 years ago
Ever since the release of Baahubali 2, rumours have been always rife about alleged affair of co-stars Prabhas & Anushka Shetty and often we used to come across the marriage rumours of the duo.

బాహుబలి2 తర్వాత ప్రభాస్, అనుష్క శెట్టి రిలేషన్స్‌పై ఎన్నో రూమర్లు, గాసిప్స్ వచ్చాయి. అయితే వాటిపై వారిద్దరూ స్పందిస్తూనే ఉన్నారు. కానీ ఆ రూమర్లకు ఎలాంటి తెరపడలేదు కదా.. కొత్తకొత్తగా కథనాలు మీడియాలో వచ్చాయి. అయితే తాజాగా భాగమతి సినిమా ప్రమోషన్ సందర్భంగా ఓ ఆంగ్ల దినపత్రికతో మాట్లాడుతూ అనుష్క తన వ్యక్తిగత, ప్రొఫెషనల్ విషయాలను వెల్లడించారు.
అవేమిటంటే...ప్రభాస్‌తో నాకు సన్నిహితమైన రిలేషన్స్ ఉన్నాయి. మేమిద్దరం మంచి స్నేహితులం, అంతకంటే మా మధ్య ఎలాంటి రిలేషన్స్ లేవు. మేము పెళ్లి చేసుకొంటున్నామనే వార్తలు అవాస్తవం అని అనుష్క వెల్లడించింది. బాహుబలి చిత్రానికి జాతీయ అవార్డు రాకపోవడంపై ఎలాంటి బాధలేదు. దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ప్రశంసలు అందాయి. అదే నాకు పెద్ద అవార్డు. మంచి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించాలన్నదే నా అభిలాష అని అనుష్క తెలిపారు.
ఇది ఇలా ఉండగా భాగమతి చిత్ర విషయానికి వస్తే, భాగమతి చిత్రం దెయ్యం కథ, పునర్జన్మతో కథతో రూపొందించిన చిత్రమని తప్పుడు ప్రచారం జరిగింది. కానీ ఆ చిత్రం సమకాలీన అంశాలతో తెరకెక్కిన థ్రిల్లర్ చిత్రం.నేను ఇప్పటి వరకు చేసిన పాత్రలతో పోల్చితే చాలా విభిన్నమైనది అని అనుష్క వెల్లడించింది. అలాగే భాగమతి చిత్రంలో నాది ద్విపాత్రాభినయం కాదు. కానీ నా పాత్రలో చాలా వేరియేషన్స్ ఉంటాయి.అని అనుష్క పేర్కొన్నారు.

Recommended