మహేష్ కత్తికి అమ్మాయిల పిచ్చి..! టాలీవుడ్ నిర్మాత ఫైర్..!

  • 6 years ago
Actor Ramky Sensational Comments on Kathi Mahesh. Ramky said he was given a chance to Mahesh Kathi for Reporter movie. He made alleagation that he does not have minimum cinema knowledge. so That we sacked from Reporter movie project.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, పూనమ్ కౌర్‌, త్రివిక్రమ్‌లపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తున్న కత్తి మహేష్‌పై నటుడు, నిర్మాత రాంకీ మండిపడ్డారు. కత్తి మహేష్‌ దర్శకత్వంలో నిర్మించిన రిపోర్టర్ చిత్రానికి ఈయన నిర్మాతగా వ్యవహరించారు. మహేష్ కత్తి చేస్తున్న వ్యాఖ్యలపై స్పందిస్తూ రాంకీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కత్తి దరిద్రాన్ని ఆపేందుకే మీడియా ముందుకు వచ్చాను అని చెప్పారు. మహేష్ కత్తి గురించి నిర్మాత రాంకీ వెల్లడించిన విషయాలు ఇవే..
రిపోర్టర్ కథతో నా వద్దకు వస్తే నేను సినిమా అవకాశం ఇచ్చాను.లోకేషన్‌లో షాట్ చెప్పి ఫేస్‌బుక్ చూసుకొంటాడు. కట్‌ కూడా చెప్పడం రాదు. ఓ దశంలో కెమెరామెన్ కట్ చెప్పేవాడు. అలాంటి వ్యక్తి డైరెక్టర్‌గా పనికిరాడు అని తీసేశాం.
మహేష్ కత్తికి సినిమాల గురించి ఏమీ తెలియదు. సినిమాల విషయంలో ఆయనకు జీరో నాలెడ్డ్. ఆయనకు సినిమా చెప్పే రివ్యూలన్నీ చెత్తే. పవన్ కల్యాణ్ హీరోనే కాడు అని అంటే చెప్పుతో కొడుతారు.
పవన్ కల్యాణ్, పూనమ్ కౌర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి వ్యాఖ్యలు చేస్తున్నందున నేను స్పందించాల్సి వస్తుంది. రివ్యూలతో సినిమా పరిశ్రమకు చీడపురుగులా మారాడు. మహేష్ కత్తి అనే దరిద్రానికి పుల్‌స్టాప్ పెట్టడానికే మీడియా ముందుకు వస్తున్నాను. రివ్యూలతో సినిమా పరిశ్రమను నాశనం చేస్తున్నాడు. సమాజాన్ని విడదీస్తేందుకు ప్రయత్నిస్తున్నాడు.