• 6 years ago
One of the most toughest competitors in Tollywood film industry, Mega and Nandamuri families. Now, a cold war taking place between both side fans.

మా హీరో ముందు ఏ హీరో అయినా దిగదుడుపే అనుకునే అభిమానులు చాలామంది ఉంటారు. హీరోలను దైవ సమానంగా భావిస్తారు. ఎవరైనా పల్తెత్తు మాట అన్నారంటే.. ఇక వాళ్లకు మూడినట్లే లెక్క. ఇక హీరోల్లో మావాడే నంబర్ వన్ అనే తరహా పేచీలు కూడా అభిమానుల్లో కామనే. ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఒకేసారి విడుదలయ్యాయంటే ఈ వైరం మరింత ముదరుతుంది. ఇప్పుడు మెగా-నందమూరి అభిమానుల మధ్య ఇలాంటి వైరమే రగులుతోంది.
పవన్ కల్యాణ్ హీరోగా నటించిన 'అజ్ఞాతవాసి' సినిమా జనవరి 10న విడుదలైన సంగతి తెలిసిందే. సినిమా విడుదల సందర్భంగా అభిమానులు ప్రతీ థియేటర్ వద్ద పదుల సంఖ్యలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. విశాఖలోని ఓ థియేటర్ వద్ద పవన్ ఇమేజ్ ను ఆకాశానికెత్తేసే తరహాలో ఓ బ్యానర్ ఏర్పాటు చేశారు.
'తాతల చరిత్ర చెప్పుకునే అలవాటు లేదు.. మేము సృష్టించే చరిత్రలే భావితరాలకు భగవద్గీత' అని పేర్కొంటూ థియేటర్ వద్ద కొంతమంది అభిమానులు ఓ బ్యానర్ ఏర్పాటు చేశారు. మెగా అభిమానులు చేసిన ఈ కామెంట్స్ పరోక్షంగా నందమూరి హీరోలపై సెటైర్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
మెగా అభిమానులు వేసిన ఈ సెటైర్ కు బాలయ్య అభిమానుల నుంచి కూడా గట్టి కౌంటరే పడింది. నేడు జైసింహా విడుదల సందర్భంగా విశాఖలోని ఓ థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన బ్యానర్ ద్వారా మెగా అభిమానులకు వాళ్లు కౌంటర్ ఇచ్చారు.

Recommended