వణికిస్తున్న చలి: ఒక్కరోజులో 40మంది మృతి, వీడియో

  • 6 years ago
Despite it being sunny, a cold wave continued in most parts of Uttar Pradesh on Wednesday.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఏడాది ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పడిపోయాయి. దీంతో తీవ్ర చలి ప్రభావం వల్ల మరణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గత 24 గంటల్లో వీచిన శీతల గాలుల వల్ల 40 మంది మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తంమీద ఈ ఏడాది చలి కాలంలో రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 143కు చేరింది. చలి గాలులు రావడంతో పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
యూపీలోని బరాబంకీ నగరంలో ఆరేళ్ల బాలుడు పాఠశాలకు వెళ్లి తీవ్ర చలి ప్రభావంతో వణుకుతూ మరణించడం అతని కుటుంబంలో విషాదం నింపింది. కాగా, చలి ఉద్ధృతి పెరగడంతో రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలలను మూసివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
పలు ప్రైవేటు పాఠశాలలు కూడా పని వేళలను మార్చుకున్నాయి. యూపీలోని కాన్పూర్, కన్నౌజ్, ఫిలిబిత్,మొరాదాబాద్, సంభాల్, అమ్రోహ, రాంపూర్, హమీర్ పూర్, ఆజంఘడ్, ఘాజీపూర్, బలియా ప్రాంతాల్లో తీవ్ర చలి వల్ల పదుల సంఖ్యలో మరణాలు నమోదయ్యాయి.
దట్టమైన పొగమంచు కమ్ముకోవడం వల్ల రోడ్లపై దారి కనిపించక పలు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. మంచు ప్రభావం యూపీలో పలు రైళ్లు, విమానాల రాకపోకలపై పడింది.
చలి కారణంగా 700 వీధికుక్కలు, ఆవులు మరణించాయని అధికారిక గణాంకాలు పేర్కొన్నాయి. మీరట్‌లో అత్యంత తక్కువ 2.9డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 3,4,5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. విపరీతమైన చలి కారణంగా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Category

🗞
News

Recommended