చైనాకు మోడీ స్ట్రాంగ్ వార్నింగ్

  • 6 years ago
Narendra Modi inaugurates first PIO parliamentarian meet. Watch Video

తరచూ సరిహద్దు వివాదాలకు తెరలేపుతున్న చైనాపై ప్రధాని నరేంద్ర మోడీ నిప్పులు చెరిగారు. తామంతట తాముగా భారత్ ఏ దేశాన్నీ ఆక్రమించుకోవాలని, వారి పరిధిలోకి వెళ్లాలని చూడబోదని మోడీ స్పష్టం చేశారు.
భారత్, చైనా సరిహద్దుల్లో చైనా సైనికులే అత్యుత్సాహం చూపుతున్నారని, భారత భూభాగాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారత సంతతి పార్లమెంటేరియన్లు, రాజకీయ నాయకులను కలుపుతూ నిర్వహిస్తున్న తొలి సదస్సును ప్రధాని మోడీ మంగళవారం ప్రారంభించారు. ఈ సందస్సుకు 23దేశాల నుంచి 134మంది పార్లమెంటేరియన్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ
గత మూడున్నరేళ్ల కాలంలో ఇండియాను మార్చి చూపించామన్నారు. దేశాభివృద్ధి ఇచ్చిపుచ్చుకునే మోడల్‌గా ఉండబోదని, ప్రజావసరాలు తీర్చేలా ఉంటుందని మోడీ చెప్పారు. సబ్ కా సాత్-సబ్ కా వికాస్ నినాదంతో భారత్ అభివృద్ధి పథంలో నడుస్తోందని అన్నారు. త కొంత కాలంగా చైనా భారత భూ భాగంలోకి వస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఇటీవల సరిహద్దు దాటి డోక్లాంలోకి చైనా బలగాలు దూసుకొచ్చిన విషయం తెలిసిందే. దీంతో భారత బలగాలు కూడా వారికి ధీటుగా జవాబివ్వడంతో చైనా వెనక్కి తగ్గింది. అంతేగాక, గత కొద్ది రోజుల క్రితం అరుణాచల్‌ప్రదేశ్‌ను తాము గుర్తించబోమని కూడా వివాదాస్పద ప్రకటన చేసింది. ఇలా తరచూ చైనా వివాదాలకు కారణమవుతున్న నేపథ్యంలో ప్రధాని మోడీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Recommended