పవన్ మహేష్ మధ్యలో పూనమ్ కౌర్‌

  • 6 years ago
Mahesh Kathi drags actress Poonam Kaur into Jana Sena chief Pawan Kalyan issue on Sunday.

హైప్ కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను పదేపదే టార్గెట్ చేస్తున్న మహేష్ కత్తి ఆదివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. ఆ తర్వాత ఆయన ఓ టీవీ ఛానల్ లైవ్ షోలో సుదీర్ఘంగా మాట్లాడారు. ఆయనకు పలువురు ఫోన్లు చేశారు. దాదాపు అందరూ కూడా మహేష్ కత్తి తీరునే తప్పుబట్టారు.
ఒక్కొక్కరు ఒక్కో సూచన చేశారు. మొత్తానికి పవన్ కళ్యాణ్‌ను మీరు కావాలనే టార్గెట్ చేస్తున్నారని, మీరు ఆయనను వదలడం లేదని, అందుకే అభిమానులు మిమ్మల్ని అంటున్నారని ఫోన్లు చేసిన వారు విమర్శించారు. ఓ విధంగా సూటిగా మహేష్ కత్తికి దిమ్మతిరిగే షాకిచ్చారు. ఫోన్లు చేసిన వారిలో పవన్ అభిమానులతో పాటు ఇతరులు కూడా ఉన్నారు. ఇతరులు కూడా ఆయన తీరునే తప్పుబట్టారు. పూనమ్ కౌర్‌ను లాగి మహేష్ కత్తి మరింత దిగజారిపోయారని అభిప్రాయపడ్డారు.
పవన్‌ను విమర్శిస్తుంటే నటి పూనమ్ కౌర్ స్పందించిన విషయం తెలిసిందే. ఈ కారణంగా మహేష్ కత్తి సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే అతను ఓ యువతిపై వ్యక్తిగత విమర్శలకు దిగి హద్దులు దాటారని చాలామంది అభిప్రాయపడ్డారు. నటి అపూర్వ మాట్లాడుతూ.. పవన్ విషయంలో మహేష్ కత్తి తీరును తప్పుబట్టారు. అంతేకాదు. పూనమ్ కౌర్ చిన్నపిల్ల అని, ఓ యువతి పరువును తీస్తారా అని నిలదీశారు. ఆమెకు తెలిసో తెలియకో మిమ్మల్ని ప్రశ్నించారని, కానీ అన్నీ తెలుసని మీరే చెప్పుకుంటున్నారని, అలాంటి మీరు ఆమెను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు

Recommended