Mumbai Fire Reasons : ముంబై కమలా మిల్స్ ప్రమాదానికి కారణాలు : మత్తు, సెల్ఫీ, నిర్లక్ష్యమే

  • 6 years ago
At least 14 people lost life, including 11 women, and 19 others were injured when a major fire broke out on the top floor of a building inside the Kamala Mill compound in Lower Parel in Mumbai.

ముంబైలోని కమలా మిల్స్ కాంపౌండ్‌లో గురువారం అర్ధరాత్రి దాటాక జరిగిన ప్రమాదానికి మత్తు, సెల్ఫీ, నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. ఈ విషాదం వెనక ఉన్న కారణాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. పుట్టిన రోజు పార్టీ చేసుకోవడానికి స్నేహితులతో కలిసి పబ్‌కు వచ్చిన ఖుష్బూ బన్సాలీ బర్త్ డే కేక్ కట్ చేసిన కాసేపటికే జరిగిన అగ్నిప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఖుష్బూ సహా 14 మంది ప్రాణాలు కోల్పోయారు.

అది ముంబైలోని లోయర్‌పరేల్‌ ప్రాంతం. అక్కడి కమలామిల్స్‌ కాంపౌండ్‌లోని ఓ భవనంలోని ఉన్న రూఫ్‌టాప్‌ పబ్‌ ‘1 అబవ్‌'లో ఓ బర్త్ డే పార్టీ సందర్భంగా సందడి నెలకొంది. పబ్‌లోని సంగీతం హోరు.. అదే భవంతిలో కింద ఉన్న సంస్థల్లోకి కూడా వినిపిస్తోంది. పుట్టిన రోజు జరుపుకుంటున్న ఖుష్బూ బన్సాలీ 10 మంది స్నేహితురాళ్లతో కలిసి పబ్‌కు వచ్చింది. అందరూ ఎంజాయ్‌మెంట్‌లో మునిగిపోయారు. సమయం రాత్రి 12 గంటలు దాటింది. అంతలోనే ఊహించని ఉత్పాతం. క్షణాల్లో పరిస్థితి మారిపోయింది. అకస్మాత్తుగా ఎక్కడో చిన్నగా ప్రారంభమైన మంటలు.. క్షణాల్లో పబ్‌ అంతా వ్యాపించాయి. చూస్తుండగానే భవనాన్ని చుట్టుముట్టాయి.. ఓవైపు మంటలు, మరోవైపు కమ్ముకుంటున్న పొగతో పబ్‌లో భీతావహ వాతావరణం నెలకొంది. అందరిలోనూ ప్రాణభయం. హాహాకారాలు చెలరేగాయి. ప్రాణాలు కాపాడుకునేందుకు అటూ ఇటూ పరుగులుతీశారు. మంటల ధాటిని తప్పించుకునేందుకు కొంతమంది వాష్‌రూమ్‌లలో దూరారు. అయినా ప్రయోజనం లేదు. పొగతో ఊపిరాడని పరిస్థితి.