AP Government has planning to transfer Tollywood to Amaravati. Already Governments officials discussed with cini celebreties.
తెలుగు చలన చిత్ర రంగ ప్రముఖుల్లో అత్యధికులు.. దాదాపుగా ఆంధ్రులే ఎక్కువగా ఉంటారు. కానీ వారు హైదరాబాద్ నగరానికి తరలి వచ్చినప్పటి నుంచి సినీ ప్రముఖులను భాగ్యనగర వాసులు అక్కున చేర్చుకున్నారు. వారంతా తమ వారేనన్న అభిప్రాయం ఏర్పడింది. కానీ ఏపీ విడిపోయినందున.. చంద్రబాబు ప్రభుత్వం తెలుగు చలన చిత్ర రంగ పరిశ్రమను ప్రతిపాదిత 'అమరావతి'కి తరలించేందుకు ప్రయత్నాలు సాగిస్తోంది.
సినీ రంగ పరిశ్రమ తరలి రావడానికి అవసరమైన రాయితీలు ఇవ్వడానికి క్యాపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ (సీఆర్డీఏ) ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసింది. అంతే కాదు 20 నుంచి 30 ఎకరాల భూమిలో స్టూడియో నిర్మాణానికి కూడా కసరత్తు చేసిందన్న వార్తలు వచ్చాయి. సినిమాలకు రాయితీలు, ప్రోత్సాహకాలు ఇచ్చి ఆకర్షించాలని యత్నిస్తోంది. ఇప్పటికే బాలీవుడ్, టాలీవుడ్‌కు చెందిన పలువురు సినీ ప్రముఖులతో ప్రభుత్వం చర్చలు జరిపింది. ప్రతిపాదిత రాజధాని నగర పరిధిలోని అనంతవరంలో శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం సమీపంలోని 5,167 ఎకరాల్లో మీడియా సిటీని ప్రభుత్వం ప్రతిపాదించిన విషయం తెలిసిందే.

Category
🗞
News