'బిగ్ బాస్' దుమ్మురేపింది..!

  • 7 years ago
Bigboss telugu show listed in most searched tv shows in 2017 google top list.

బిగ్ బాస్' షో తెలుగులో మొదలైనప్పుడు ఎన్నో సందేహాలు. అసలు ఇలాంటి షో తెలుగులో సక్సెస్ అవుతుందా? అన్న ప్రశ్నలే ఎక్కువగా వినిపించాయి. మధ్యలో షో శ్రుతిమించుతోందన్న విమర్శలూ వచ్చాయి. కానీ బుల్లి తెరపై ఈ షో విజయవంతంగా మొదటి సీజన్ పూర్తి చేసుకుంది. ఎక్కువమంది వీక్షకులను కట్టిపడేసిన 'షో'గా బుల్లి తెరపై బిగ్ బాస్ ఆదరాభిమానాలను చూరగొంది. తాజాగా గూగుల్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది.
2017లో ప్రపంచ వ్యాప్తంగా గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో అత్యధిక మంది వెతికిన టీవి షోల్లో తెలుగు 'బిగ్ బాస్' ఆరో స్థానం సాధించింది. జులై నుంచి ఆగస్టు మధ్య ఈ షో కోసం ఎక్కువమంది గూగుల్ లో సెర్చ్ చేశారట.
బిగ్ బాస్ షో కు జూనియర్ ఎన్టీఆరే పెద్ద బలం అన్నది చాలామంది వాదన. షో పట్ల అటెన్షన్ క్రియేట్ చేయడంలోను.. ఆసాంతం తన హావభావాలతో ప్రేక్షకులను కట్టిపడేయడంలోను.. వాక్చాతుర్యంలోను ఎన్టీఆర్ షోకు సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా నిలిచారు. షో కి ట్రాఫిక్ క్రియేట్ చేయడంలో ఎన్టీఆర్ ప్రధాన పాత్ర పోషించారనే చెప్పాలి.
బిగ్ బాస్ షో ప్రారంభంలో జనాలు ఆసక్తిగా వీక్షించారు. కానీ రాను రాను.. షో లో ఏదో మిస్సవుతున్న ఫీలింగ్ కలిగింది. దానికి తోడు షో లో సభ్యులకు ఇచ్చిన కొన్ని టాస్కులు కూడా అంతగా ఆకట్టుకోలేకపోయాయి. కానీ ఆ తర్వాత అనూహ్యంగా బిగ్ బాస్ మళ్లీ ట్రాక్ ఎక్కింది. షో కొనసాగినన్ని రోజులు చాలామంది ఆసక్తిగా వీక్షించారు.