వేలైక్కరన్ మూవీ పై సెన్సార్ ఏమందో తెలుసా ?

  • 7 years ago
After Thani Oruvan, director Mohan Raja is back again with another socially relevant film- Velaikkaran. The movie starring Sivakarthikeyan, Fahadh Faasil and Nayanthara in lead roles is one of the most awaited Tamil films of the year.

తని ఒరువన్ చిత్రం తర్వాత సామాజిక అంశంతో డైరెక్టర్ మోహన్ రాజా రూపొందిస్తున్న చిత్రం వేలైక్కరన్. ఈ చిత్రంలో శివకార్తీకేయన్, ఫహద్ ఫాజిల్, నయనతార నటిస్తున్నారు. తమిళ చిత్ర పరిశ్రమలో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫిలిం సర్టిఫికెట్ కోసం ఈ చిత్రాన్ని ఇటీవల సెన్సార్ బోర్డు అధికారులకు ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్ బోర్డు అధికారులు సంతృప్తిని శ్యక్తి చేసి ఎలాంటి కట్ లేకుండా యూ సర్టిఫికెట్‌ను జారీ చేయడం విశేషం.
తని ఒరువన్ చిత్రం మాదిరిగానే సామాజిక సందేశంతోపాటు మంచి కమర్షియల్ చిత్రంగా వేలైక్కరన్ రూపొందింది. వైద్యరంగంలో చోటుచేసుకొంటున్న లోపాలు, వైద్య వృత్తిలో మాఫియా అంశాల ఆధారంగా వేలైక్కరన్ సినిమాను తెరకెక్కించారు. అలాంటి చిత్రంపై సెన్సార్ బోర్డు అధికారులు ప్రశంసల వర్షం కురిపించారు. చిత్ర యూనిట్‌ను అభినందించారు.
ఆహార కల్తీ, అవినీతి వ్యవస్థపై మురికివాడల ప్రజలు సాగించిన పోరాటమే వేలైక్కరన్ చిత్ర కథ. ఈ చిత్రాన్ని అణగారిన ప్రజలకు అంకితం ఇస్తున్నట్టు చిత్ర యూనిట్ పేర్కొన్నది. సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై ప్రజలకు అవగాహన కల్పించడమే తమ లక్ష్యమని, అందుకే ఈ చిత్రాన్ని రూపొందించాం అని చిత్ర నిర్మాతలు వెల్లడించారు.
వేలైక్కరన్ చిత్రంలో నయనతార, స్నేహ, ప్రకాశ్ రాజ్, ఆర్జే బాలాజీ, సతీష్, రోహిణి తదితరలు నటించారు. అనిరుధ్ రవిచంద్రన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని పాటలు విశేషంగా ఆకట్టుకొంటున్నాయి.

Recommended