"అనుష్క-విరాట్" పెళ్ళి వీడియో !

  • 6 years ago
Virat Kohli and Anushka Sharma have tied the knot and got hitched in a destination wedding at Milan, Italy. The cricketer and the actress first met during the shoot of a TVC, cupid struck and the rest, as they say, is history.

బాలీవుడ్ తార అనుష్క శర్మ, భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ వివాహం ఇటలీలోని మిలాన్‌లో ఘనంగా జరిగింది. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం జరిగినట్టు వార్తలు వెలువడుతున్నాయి. తమ పెళ్లి వార్తను విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలిద్దరూ తమ ట్విట్టర్ అకౌంట్లలో అధికారికంగా ప్రకటించారు. బాలీవుడ్ తార జాక్వెలైన్ ఫెర్నాండెజ్ దాదాపు విరుష్క పెళ్లి వార్తను దాదాపు ధ్రువీకరించడం గమనార్హం.అనుష్క శర్మను బాలీవుడ్‌కు పరిచయం చేసిన యశ్‌రాజ్ ఫిలింస్ విరుష్క పెళ్లివార్తను ధృవీకరించింది. అనుష్కశర్మ, విరాట్ కోహ్లీ పెళ్లి జరిగింది. ఇటలీలో నిరాడంబరంగా జరిగిన ప్రైవేట్ కార్యక్రమానికి బంధువులు హాజరయ్యారు. హిందూ సంప్రదాయం ప్రకారమే వివాహం జరిగింది.
పెళ్లి వార్తను విరాట్ తెలియజేస్తూ..జీవితాంతం కలిసి ఉండాలని ఈ రోజు మేము ఒట్టుపెట్టుకొన్నాం. మా వివాహ వార్తను తెలియజేయడానికి చాలా సంతోషిస్తాన్నాం. నా కుటుంబానికి, సన్నిహితుల ప్రేమానురాగాలతో ఈ రోజు చాలా అందమైన రోజుగా మారింది. అత్యంత కీలకమైన నా జీవిత ప్రయాణంలో భాగమైన వారిందరికీ థ్యాంక్యూ అని ట్వీట్టర్‌లో విరాట్ కోహ్లీ వెల్లడించారు.
విరాట్ కోహ్లీ పోస్ట్ చేసిన సందేశాన్నే అనుష్క శర్మ కూడా పోస్ట్ చేశారు. ఈ వివాహం తర్వాత విరుష్క ఇద్దరూ దేశంలోనే మోస్ట్ పవర్ ఫుల్ సెలబ్రిటీ కపుల్‌గా మారిపొయారు. విరాట్, అనుష్క వివాహం ఇటలీలోని టస్కనీ అనే అందమైన ప్రదేశంలోని బోర్గో ఫిన్నోషియేటో అనే వైన్ యార్డులో జరిగింది. ఆ ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్టు సమాచారం.

Recommended