Jayalalithaa's Last Days Mystery : Dr Balaji Reveals Details

  • 6 years ago
Tamil Nadu CM was improving just before her last days. Sasikala went to Jayalalithaa's room daily. Dr Balaji details behind Arumugasamy Commission Jayalalithaa's medical condition improved on December 2.

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అనుమానాస్పద మృతిపై విచారణ చేపట్టిన మద్రాసు హైకోర్టు రిటైడ్ న్యాయమూర్తి ఆర్ముగస్వామి కమిటీ విచారణ ముమ్మరం చేసింది. అమ్మ మృతిపై తమిళనాడు ప్రభుత్వ డాక్టర్లు బాలాజీ, ధర్మారాజ్ లను విచారణ కమిటీ తమ కార్యాలయానికి పిలిపించి ప్రశ్నల వర్షం కురుపించింది. డిసెంబర్ 2వ తేదీన జయలలిత ఆరోగ్యం మెరుగుపడిందని, తాను స్వయంగా చూశానని డాక్టర్ బాలాజీ విచారణ కమిటి కమిషన్ చీఫ్ ఆర్ముగస్వామి ముందు వాంగ్మూలం ఇచ్చారు.
జయలలిత అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గదిలోకి శశికళ ప్రతిరోజూ వెళ్లేవారని, తాను స్వయంగా చూశానని తమిళనాడు ప్రభుత్వ వైద్యుడు డాక్టర్ బాలాజీ ఆర్ముగస్వామి విచారణ కమిటీ ముందు వివరణ ఇచ్చారు.జయలలిత ఆహారం తీసుకున్నారని అందరూ చెబుతున్న మాటల్లో ఎలాంటి వాస్తవం లేదని డాక్టర్ బాలాజీ స్పష్టం చేశారు. అపోలో ఆస్పత్రిలో జయలలిత చేరిన రెండువారాల దాకా ఆమె ఇడ్లీలు తినలేదని, కేవలం ద్రవపదార్థాలు (జ్యూస్ లు) మాత్రమే తీసుకున్నారని డాక్టర్ బాలాజీ ఆర్ముగస్వామి విచారణ కమిటీ ముందు క్లారిటీ ఇచ్చారు.