Revanth Reddy Speech at Congress Praja Garjana Meet

  • 7 years ago
Revanth Reddy, while taking part at the Congress Praja Garjana meet in Achampet mandal of Nagarkurnool district on Sunday, called upon the people, particularly the youth to take part in the upcoming ‘Koluvulakai Kotlata’ meet by Kodandaram, Chairman of Telangana Joint Action Committee (TJAC) to be held next week in Hyderabad.

తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు బీసీలను కరివేపాకులా వాడుకొని వదిలేస్తారని కాంగ్రెస్ నేత, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఆదివారం అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో నిర్వహించిన ప్రజా గర్జన బహిరంగ సభలో రేవంత్ మాట్లాడారు. బీసీ వర్గానికి చెందిన ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్‌ మధుసూదనా చారిని తొలగించి వేరే వారికి టికెట్ ఇవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నారని, కేసీఆర్‌కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే 24 గంటల్లోపు భూపాలపల్లి ఎమ్మెల్యే టికెట్ మధుసూదనా చారికే ఇస్తున్నట్లు ప్రకటించాలని సవాల్ విసిరారు.
సామాజిక న్యాయం కోసమే తాను, తనతో పాటు పెద్ద ఎత్తున టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరామని రేవంత్ రెడ్డి చెప్పారు. నిరుద్యోగుల కోసం జేఏసీ చైర్మన్ కోదండరాం కొలువుల కోసం కొట్లాట సభకు అనుమతి ఇవ్వమంటే అడ్డుకున్న కేసీఆర్‌ మద్యం తాగి వేడుకలు చేసుకునే పబ్బులకు మాత్రం అనుమతిచ్చారని ఆరోపించారు. ఎన్నికల ముందు లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి, ఇప్పటి వరకు కేవలం 5,932 ఉద్యోగాలను భర్తీ చేశారన్నారు.

Recommended