రాశీఖన్నా ఇంత బాగా చేసిందా ? ఫస్ట్ ఆడిషన్ వీడియో

  • 7 years ago
Rashi Khanna, who made her Tollywood debut with “Oohalu Gusagusalade” along with Naga Shourya, First Audition Video.

టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకుంది రాశీఖన్నా. ఆమె నటించిన చిత్రాలు బాక్సాఫీసు వద్ద హిట్ కొట్టడంతో ఆమె ఆనందానికి అవధుల్లేవు. ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీలు చాలామంది మోడ‌లింగ్ రంగం నుండి వ‌చ్చినవారే! కొంద‌రు యాడ్స్ ద్వారా రాణిస్తే.. మోడ‌లింగ్‌లో టాలెంట్‌ క‌న‌బ‌రిచి వెండితెర‌పై ఓ వెలుగు వెలుగుతున్నారు. 30 ఏళ్ల రాశిఖన్నా.. "ఊహాలు గుస‌గుస‌లాడే" చిత్రంతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది. త‌ను ఇండ‌స్ట్రీకి రాక‌ముందు ఆడిష‌న్ చేసిన వీడియో ఒక‌టి అభిమానుల‌ను ఎట్రాక్ట్ చేసుకుంటోంది..
"సినిమాల్లోకి రాకముందు నా లోకమే వేరు. చదువు తప్ప మరొకటి ఉండేది కాదు. ఇంటర్మీడియట్‌లో నేను ఆలిండియా టాపర్‌ను. ఎప్పుడూ పుస్తకాలతోనే జీవితం గడిపేదాన్ని.
కానీ ఓ అనౌన్స్‌మెంట్ నా జీవితాన్ని మార్చేసింది. ఢిల్లీలో ఓసారి స్నేహితురాలితో కలిసి షాపింగ్‌మాల్‌కు వెళ్లా. ‘ఒక్క ఫొటో తీయించుకోండి.. మోడల్ అవ్వండి' అంటూ అక్కడ వ్యాజిలీన్ కంపెనీ వాళ్లు ఓ అనౌన్స్‌మెంట్ చేస్తున్నారు. అది విన్న నేను సరదా కోసం ఫొటో తీయించుకున్నా.ఆ తరువాత నాలుగు రోజులకు ఫెమినా మ్యాగజైన్ కవర్‌పేజీపై నా ఫొటో వచ్చింది.డిగ్రీ చదువుతూనే అలా మూడేళ్లపాటు మోడలింగ్ చేశా. ఓ రోజు "మద్రాస్ కెఫె" నుంచి సినిమా ఆఫర్ వచ్చింది. ఆడిషన్ అవగానే సెలెక్ట్ అయ్యానని గతం లోనే చెప్పింది .అయితే సోష‌ల్ మీడియాలో రాశీకి సంబంధించిన ఓ వీడియో వైర‌ల్ అయింది.

Recommended