ఇవాంకాకు బాహుబలి ప్రభాస్ దూరం

  • 6 years ago
The Baahubali 2 star Prabhas is the talk of the town as his larger than life film shattered all the records at the box office and people are eagerly waiting for his next release Saaho.

బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసి సినిమా బిజినెస్ సత్తాను నిరూపించిన చిత్రం బాహుబలి2. దర్శకుడు రాజమౌళి రూపొందించిన చిత్రానికి ప్రభాస్ వెన్నుముకగా నిలిచారు. ఈ చిత్రం ద్వారా దేశవ్యాప్తంగా ప్రజాదరణను కూడగట్టుకొన్నారు. ఇంతటి క్రేజ్ ఉన్న హీరో ప్రభాస్ మాత్రం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ పాల్గొనే సదస్సుకు దూరం కావడం చర్చనీయాంశమైంది.
బాహుబలితో మంచి కమర్షియల్‌ హీరోగా సినీ వర్గాల నుంచి కొనియాడిన ప్రభాస్‌ను తొలుత గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్‌కు ఆహ్వానించాలని ప్రభుత్వం భావించింది. అయితే చివరి నిమిషంలో ఆహ్వానితుల జాబితాలో ప్రభాస్ పేరు లేకపోవడం ఓ వర్గాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది.
ఇవాంక నేతృత్వంలో జరిపే అంతర్జాతీయ సదస్సుకు ప్రభాస్‌ను ఆహ్వానించి పారిశ్రామిక వర్గాలకు స్ఫూర్తిగా నిలిచేలా చూడాలని భావించారట. అయితే ఆ తర్వాత సినీ ప్రముఖులను ఆహ్వానించడం వల్ల సదస్సు లక్ష్యం దెబ్బతింటుందని కొందరు వెల్లడించిన అభిప్రాయం మేరకు తమ ఆలోచనను మానుకొన్నారట.
అయితే ఇవంకా సదస్సుకు కొందరు సినీ ప్రముఖులు హాజరవుతున్నారు. అయితే వారు సినీ తారల హోదాలో కాకుండా వ్యాపారవేత్తలుగా ఈ సదస్సుకు హాజరుకానున్నారు.
ఈ నేపధ్యం లో ఇవాంకా ట్రంప్ మంగళవారం ఉదయం హైదరాబాద్‌కు చేరుకొన్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇవాంకకు అధికారులు ఘన స్వాగతం పలికారు.

Recommended