Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu inaugurated a Real Time Governance State Center at the Secretariat in Amaravati on Sunday. The Center has been developed for tracking the progress of all the districts in the state, through e-governance
పరిపాలనకు టెక్నాలజీని జోడించి ప్రజల చేత మన్ననలను పొందాలనే లక్ష్యంతో నూతన వ్యవస్థను ఆవిష్కరించారు ఎపి సిఎం చంద్రబాబు. రాష్ట్రంలో ఎక్కడ, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ఆ సమాచారాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు వీలుగా రియల్‌టైమ్ గవర్నెన్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటుచేశారు. ఎపి సచివాలయంలోని మొదటి అంతస్థులో ఏర్పాటు చేసిన రియల్‌టైమ్ గవర్నెన్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం ప్రారంభించారు.
పరిపాలనలో టెక్నాలజీ మేళవించడం ద్వారా హైటెక్ ముఖ్యమంత్రిగా దేశవ్యాప్తంగా పేరొందారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తాజాగా టెక్నాలజీ ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ఆయన చేపట్టిన మరో ప్రాజెక్ట్ రియల్‌టైమ్ గవర్నెన్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్. దీని ద్వారా రాష్ట్రంలోని ఏ మారుమూల ప్రాంతంలోని అధికారులు, ప్రజలతో ముఖ్యమంత్రి నేరుగా మాట్లాడవచ్చు.. విపత్తులు, ప్రమాదాల సమయంలో ఈ సెంటర్ నుంచి పర్యవేక్షిస్తూ అధికారులు, సహాయ సిబ్బందికి సీఎం ఆదేశాలు ఇవ్వొచ్చు. దీని కోసం 13 జిల్లాల్లో కమాండ్ కంట్రోల్ రూమ్స్ ఉంటాయని అధికారులు తెలిపారు. అంతే కాదు సచివాలయం నుంచి డ్రోన్ల ద్వారా మొత్తం వ్యవస్థను పర్యవేక్షించే అవకాశం ఉంది.

Category
🗞
News