రగులుతున్న వివాదం.. పోసాని పై సత్యారెడ్డి ఆగ్రహం

  • 7 years ago
Producer Satya Reddy serious reply to Posani Krishnamurali comments on Nandi Awards.

నంది అవార్డుల వివాదం ఇప్పట్లో ముగిసేలా లేదు అవార్డులు ప్రకటించినప్పటినుంచీ ఏదో ఒక విమర్శవస్తూనే ఉంది. అయితే ప్రముఖుల్లో అందరి స్పందన వేరూ పోసాని కృష్ణమురళి ఇచ్చిన స్పందన వేరు... ఆయన సహజ శైలి లో కాస్త ఘాటుగానే తన అభిప్రాయం చెప్పాడు. అయితే ఈ వ్యవహారం కాస్తా పోసాని సొంత వ్యవహారం అయ్యింది.. ఇప్పుడు నంది గొడవ మొత్తం పోసాని మెడకు చుట్టుకునేలాఉంది...
ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డుల ప్రకటన వివాదాస్పదమైన నేపథ్యంలో మంత్రి లోకేష్‌బాబు స్పందించిన తీరుపై సినీ ప్రముఖుడు పోసాని కృష్ణమురళి విరుచుకుపడ్డారు. మంత్రి లోకేశ్ బాబు చెప్పిన ప్రకారం నంది అవార్డులపై విమర్శలు చేస్తున్న వారంతా నాన్ రెసిడెంట్ ఆంధ్ర (ఎన్ఆర్‌ఏ)లే.
వారికి ఆంధ్రలో ఆధార్ కార్డులు లేవు. అలాంటి వారే నంది అవార్డులపై విమర్శలు చేస్తున్నారని చేసిన వ్యాఖ్యలను పోసాని తప్పుపట్టారు. అసలు నంది అవార్డులని రద్దు చేస్తామనటానికి నువ్వెవరు? అన్న స్థాయిలో విరుచుకు పడ్డ పోసాని ఇప్పుడు చిక్కుల్లో పడ్డట్టు కనిపిస్తోంది...
నంది అవార్డులపై ప్రశ్నిస్తే అసలు నంది అవార్డులు రద్దు చేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నట్లుగా ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో.. ఇటు తెలుగు సినీ పరిశ్రమ అటు ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు బాధపడే విధంగా పోసాని మాట్లాడారని నిర్మాత సత్యారెడ్డి, పోసానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసలు పోసానిగారు మాట్లాడిన ఆరోపణల్లో 10 ఆరోపణలు అవాస్తవాలని ఆయన అన్నారు. అందులోని మొదటి ఆరోపణ అవార్డల గురించి ప్రశ్నిస్తే.. నంది అవార్డులను ప్రభుత్వం రద్దు చేస్తుందని పోసాని అన్నారు. కానీ అలా ఎవరు ఎప్పుడు ఎక్కడ అన్నారో నిరూపించాలి.

Recommended