• 8 years ago
Tamil producer Ashok Kumar, the film industry is in a state of shock. A few members of the producers' council and close friends from the industry have reached Madurai to attend the funeral of Ashok.

ప్రకాష్‌రాజ్‌ ఈ విషయమై ఇప్పటిదాకా పెదవి విప్పడంలేదు. 'నేను ఓ భారతీయుడ్ని.. నా దేశంలోని ప్రభుత్వం, ప్రజా వ్యతిరేక విధానాల్ని అవలంభిస్తున్నప్పుడు పౌరుడిగా ప్రశ్నించే హక్కు నాకుంది. నరేంద్రమోడీ బీజేపీ ప్రధాని కాదు, భారత ప్రధాని. ఆయన నిర్ణయాలు తప్పయితే, వాటిని ప్రశ్నించి తీరతాను..' అంటూ మొన్నామధ్య బెంగళూరులో జర్నలిస్ట్‌ గౌరీ లంకేష్‌ హత్యానంతరం ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించి వార్తల్లోకెక్కారు ప్రకాష్‌రాజ్‌.
అప్పటినుంచీ, బీజేపీకీ - ప్రకాష్‌రాజ్‌కీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మధ్యలో కొన్నాళ్ళు ఈ వ్యవహారం సద్దుమణిగినా, ఇప్పుడు ప్రకాష్‌రాజ్‌ సోషల్‌ మీడియా వేదికగా "జస్ట్‌ ఆస్కింగ్‌" అంటూ ప్రశ్నాస్త్రాలు సంధించడంతో వివాదం మళ్ళీ మొదటికొచ్చింది. జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్యతో పాటు అనేక అంశాలపై ఆయన నిరసన స్వరం వినిపించారు.
మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన గట్టిగా మాట్లాడారు. ఇటీవలే ‘పద్మావతి' సినిమా విషయంలో నడుస్తున్న నిరసనలు.. ప్రభుత్వ మౌనంపై ఆయన తీవ్రంగా స్పందించారు. తాజాగా ఆయన తమిళ నిర్మాత అశోక్ కుమార్ ఆత్మహత్యపై మాట్లాడారు. సినీ పరిశ్రమలో అంతర్గతంగా ఎలాంటి సమస్యలుంటాయో చెప్పడానికి ఈ ఉదంతం ఉదాహరణ అని అన్నారు.
సినీ పరిశ్రమ చాలా గ్లామరస్ గా కనిపిస్తుందని.. కానీ ఇక్కడి వాళ్లకు అసలేమాత్రం రక్షణ అన్నది లేకుండా పోయిందని ప్రకాష్ రాజ్ అన్నాడు. తాము ప్రభుత్వానికి భారీగా పన్నులు కడతామని.. అయినప్పటికీ తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి మద్దతూ లేదని ఆయన అభిప్రాయపడ్డాడు.

Recommended