Nandi Awards controversy : పోసానికి లోకేష్ కౌంటర్, కులంతో బాలకృష్ణ కి ఝలక్

  • 7 years ago
Andhra Praddesh Minister Nara Lokesh counter to Posani Krishna Murali and others over Nandi Awards controversy.

నంది అవార్డుల వివాదం, ఓటు హక్కుపై తాను చేసిన వ్యాఖ్యలపై కొందరు మండిపడుతుండటంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మంగళవారం స్పందించారు. సినీ ప్రముఖులు పోసాని కృష్ణ మురళీ మంత్రి పైన తీవ్రంగా మండిపడ్డారు. మరికొందరు ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీనికి లోకేష్ కౌంటర్ ఇచ్చారు. తనకు ఆంధ్రప్రదేశ్‌లో ఓటు హక్కు లేకపోతే శాసన మండలి సభ్యుడిగా ఎలా అవుతానని లోకేష్ ప్రశ్నించారు. తాను ఎన్ఆర్ఏ (నాన్ రెసిడెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్) వ్యాఖ్యలు చేయడంతో తన ఓటు హక్కు ఎక్కడ ఉందోనని కొందరు ఆరా తీస్తున్నారని చెప్పారు. తాను ఎమ్మెల్సీని అనే విషయం గుర్తుంచుకోవాలని సూచించారు. తన తనయుడు దేవాన్ష్‌కు ఉండవల్లిలోనే ఆధార్ కార్డు ఉందన్నారు.

Recommended