Metro Rail Operations On November 28th | Oneindia Telugu

  • 7 years ago
As the Commissioner of Metro Rail Safety (CMRS) is yet to issue safety clearance for the launch of Metro Rail operations on November 28, the state government is working on alternative plans.

ప్రారంభానికి ముందే మన మెట్రో ఎన్నో ఘనతలను సొంతం చేసుకుంటోంది. అతిపెద్ద మెట్రోగా రికార్డులకెక్కిన హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు ఇప్పటికే ఎన్నో అవార్డులు వరించాయి. అంతేగాక, ఇప్పటికే మెట్రోకు ప్రకటనల ద్వారా ఆదాయం వస్తుండటం గమనార్హం. తాజాగా, ఈ నవంబర్ నెలలోనే ప్రారంభం కానుండటంతో నగరానికి కొత్త కళ రానుంది.
మెట్రో స్టేషన్లలో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించగానే ఆదాయం భారీగా వచ్చే అవకాశం ఉంది. కాగా, మెట్రో రైలు ఫైనాన్షియల్‌ మోడల్‌లో ఐదు శాతం ఆదాయం ప్రకటనల ద్వారా సమకూర్చుకోవాలనేది ప్రణాళిక. మెట్రోస్తంభాలు, పోర్టల్స్‌, వయాడక్ట్స్‌, పిట్టగోడలు, ఆబ్లిగేటరీ స్పాన్స్‌, స్టేషన్‌ బయట ప్రకటనలన్నీ సెంట్రల్‌ డివైడర్‌ కిందనే నిర్వచనంతో ప్రకటనలకు అనుమతి ఇచ్చారు. అయితే, ప్రస్తుతం స్తంభాల వరకే ప్రకటనలు ప్రారంభమయ్యాయి.
ప్రారంభానికి ముందే హైదరాబాద్‌ మెట్రోరైలు కోచ్‌లపై ప్రకటనలతో ఎల్‌అంట్‌టీ మెట్రో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇది దేశంలోనే తొలిసారి కావడం గమనార్హం.
ప్రయాణికుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చిన స్మార్ట్‌ కార్డుపైనా ప్రకటనల ఏర్పాటుకు అవకాశం కల్పిస్తోంది. స్టేషన్‌లో శీతల పానీయాలు విక్రయిస్తారు. మెట్రోతో ఒప్పందం చేసుకున్న సంస్థకు చెందిన పానీయాలే అమ్మాల్సి ఉంటుంది. కోక్‌తో ఒప్పందం దృష్ట్యా స్టేషన్లలోని రిటైల్‌ దుకాణాల్లో ఇవి మాత్రమే అందుబాటులో ఉంటాయి. స్టేషన్‌ లోపల ప్రసార హక్కులను విక్రయిస్తున్నారు.

Recommended