మరో సారి డాన్-3 తో రానున్న కింగ్ ఖాన్

  • 7 years ago
Don 3 has been in the news for a while now, and producer Ritesh Sidhwani says that plans are very much on.

షారుఖ్ ఖాన్ హీరోగా రూపొందిన రెండు 'డాన్' చిత్రాలు జనాన్ని అలరించాయి. ఇప్పుడు వాటి సిరీస్ లోనే 'డాన్-3' రానుందని వినిపిస్తోంది. ఇంతకీ ఆ ముచ్చటేంటంటారా.. విఖ్యాత బాలీవుడ్ రచయితల ద్వయం 'సలీమ్-జావేద్' రాసిన 'డాన్' చిత్రం అమితాబ్ బచ్చన్‎ను ఆల్ ఇండియా సూపర్ స్టార్‎గా నిలిపింది. ఇదే కథను ఆ రచయితల ద్వయంలోని జావేద్ తనయుడు పర్హాన్ అక్తర్ 'డాన్' పేరుతోనే షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కించాడు.
ఈ సినిమా పలు విమర్శలు ఎదుర్కొన్నా, మొత్తానికి 'డాన్' రీమేక్ అన్న ఆసక్తితో వసూళ్ళు బాగానే రాబట్టింది. అయితే ఒరిజినల్ 'డాన్'ను చెడగొట్టారని కొందరు విమర్శకులు అన్నారు. దానిని ఛాలెంజ్‎గా తీసుకొని ఫర్హాన్ అక్తర్, అదే షారుఖ్ ఖాన్ తో 'డాన్-2' తెరకెక్కించాడు. కానీ ఈసారి పెద్దగా ఆకట్టుకోలేకపోయారు.
బిగ్ బి అమితాబ్ బచ్చన్ 'డాన్' చిత్రం 1978లో విడుదలై సూపర్ హిట్టయ్యింది. అండర్ వరల్డ్ డాన్ పాత్రలో అమితాబ్‌ను తప్పితే వేరెవరినీ ఊహించలేమని చాలామంది అన్నారు. కానీ ఈ పాత్రను తాను చేసి మెప్పించగలనని ఆ తర్వాతి తరంలో షారుఖ్ ఖాన్ నిరూపించాడు. 2006లో ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో 'డాన్' చిత్రాన్ని రీమేక్ చేసి శబాష్ అనిపించుకున్నాడు షారుఖ్.
అమితాబ్ 'డాన్'లా షారుఖ్ 'డాన్' లేదనే విమర్శలు వినిపించడంతో దర్శకుడు ఫర్హాన్ అక్తర్ ఛాలెంజ్‌గా తీసుకొని 'డాన్-2' రూపొందించాడు. డాన్-2' చూసి జనం షారుఖ్, ఫర్హాన్‌ను అభినందించారు. ప్రస్తుతం షారుఖ్‌కు సరైన సక్సెస్ లేక చాలా రోజులయింది. దాంతో "డాన్-3"పై మనసు పడ్డాడని సమాచారం.