Gujarat elections 2017 : బంగాళాదుంప తో బంగారం ?

  • 7 years ago
Last year, Congress vice-president Rahul Gandhi had set the Internet on fire when he talked about opening a potato factory while addressing farmers in the politically sensitive Uttar Pradesh. This time, his another 'potato' remark has made the Congress the subject of online memes.

ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీకి చెందిన ఓ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆయన బిజీగా ఉన్నారు.ఈ సందర్భంగా రాహుల్ తన ఎన్నికల ప్రచారంలో తప్పులు దొర్లాయంటూ ఆ వీడియోలు ఇంటర్నెట్, వాట్సాప్‌లలో హల్‌చల్ చేస్తున్నాయి. అందులో బంగాళాదుంపలను యంత్రంలో పెట్టగానే బంగారం వచ్చేలా ఓ యంత్రం తయారు చేస్తానని, దీని వల్ల రైతులకు బాగా డబ్బులు వస్తాయని రాహుల్ చెప్పినట్లుగా ఆ వీడియోలో ఉంది.
రాహుల్ గాంధీ ప్రసంగంలో పలుమార్లు పొరపాటు దొర్లింది. గతంలో ఉత్తర ప్రదేశ్‌లో మామిడి పండ్లను తయారు చేసే యంత్రాలను అంటూ వ్యాఖ్యానించారు. బెంగళూరులో క్యాంటీన్లకు బదులు క్యాంపెయిన్ అన్నారు. దీంతో ఇప్పుడు ఆలు మిషన్లో పెడితే బంగారం అన్న వీడియో హల్‌చల్ చేస్తోంది.
రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు సంబంధించి ఇరవై సెకండ్ల వీడియో వైరల్ అవుతోంది. అయితే అసలు వీడియో అది కాదని, ఆయన అలా మాట్లాడలేదని దాదాపు రాహుల్ అరగంట మాట్లాడారంటూ మరో వీడియో బయటకు వచ్చింది.