Anushka Setty Birthday Special అనుష్క బర్త్ డే స్పెషల్

  • 7 years ago
Anushka setty birth day special..Sweety Shetty (born 7 November 1981), known by her stage name Anushka Shetty, is an Indian actress and model who predominantly works in Telugu and Tamil films.
అందం అభినయం హైటు వెయ్టు వున్న హీరోయిన్ ఎవరు అంటే టక్కున గుర్తొచ్చేది స్వీటి..అదేనండి..అనుష్క సెట్టి.. తెలుగు మరియు తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ ఎన్నో అవార్డు లను సొంతం చేసుకుని ఫిలిం ఇండస్ట్రీస్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి అనుష్క. ఈ రోజు అనుష్క పుట్టిన రోజు..ఈ సందర్బంగా అనుష్క గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం..అనుష్క బెంగుళూరు నగరానికి చెందిన యోగా శిక్షకురాలు. అనూష్క అసలు పేరు స్వీటీ శెట్టి. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో నాగార్జున నటించిన సూపర్ చిత్రం ద్వారా ఈమె సినీరంగంలో అడుగుపెట్టింది. ఆ తరువాత ఈమె విక్రమార్కుడు, లక్ష్యం వంటి విజయవంతమైన చిత్రాల ద్వారా తెలుగు చిత్రరంగంలో కథానాయికగా తన స్థానాన్ని పదిలపరచుకున్నది. తమిళంలో మాధవన్ సరసన రెండు చిత్రం ద్వారా పరిచయమైంది.
కుటుంబ సభ్యులు ఈమెను స్వీటీ అని, సన్నిహిత స్నేహితులు టొమ్ములు అని పిలుస్తారు. బెంగుళూరు విశ్వవిద్యాలయానికి అనుసంధానంగా ఉన్న మౌంట్ కార్మెల్ కళాశాలనుండి బి.సి.ఏ పట్టా పొందింది. అయితే కంప్యూటర్ రంగంలో పనిచేసే ఉద్దేశ్యమేమీ లేదని, ఫిట్‌నెస్ రంగంలో పనిచెయ్యాలని భావించిందట. ఈమె యోగా శిక్షణ కూడా ఇస్తుంది..సినీ నటుడు నాగార్జున ఈమెను సినీరంగానికి పరిచయం చేశాడు.

Recommended