Virat Kohli Funniest Interview

  • 7 years ago
Team India Captain Virat Kohli funniest interview by gaurav kapoor.

2014లో టీమిండియా ఇంగ్లాండ్ పర్యటన తన కెరీర్‌లోనే అత్యంత చెత్త దశ అని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు. గౌరవ్ కపూర్ నిర్వహించిన 'బ్రేక్‌ ఫాస్ట్‌ విత్‌ ఛాంపియన్స్‌' కార్యక్రమంలో పాల్గొన్న విరాట్ కోహ్లీ కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు.
2011 వరల్డ్ కప్, 2013 ఛాంపియన్స్‌ ట్రోఫీ, టెస్టుల్లో టీమిండియా నెంబర్‌వన్‌ ర్యాంకుని కైవసం చేసుకోవడం తన జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని అనుభూతి అని కోహ్లీ వెల్లడించాడు. తన జీవితంలో ఎదుర్కొన్న ఓ సమస్యకు మాజీ పేసర్ జహీర్‌ఖాన్‌ నుంచి సలహా తీసుకున్నట్లు కోహ్లీ తెలిపాడు.
2014లో ఇంగ్లాండ్‌ పర్యటనకు వెళ్లినప్పుడు అనుష్క నాతోనే ఉంది. ఆ సిరిస్‌లో నేను రాణించలేదు. అప్పుడు నన్ను అనుష్క ఎంతో ప్రోత్సహించింది. ఆ తర్వాత ఆసీస్ పర్యటన సమయంలోనూ ఆమె నాతోనే ఉంది. అప్పుడు బాగానే ఆడా. నేను బాగా ఆడకపోతే చాలు అనుష్కను ఎందుకు కారణంగా చూపుతారో నాకు ఇప్పటికీ తెలియదు' అని కోహ్లీ అన్నాడు.

Recommended