• 8 years ago
The Telugu version of Tamil film Mersal starring Vijay, which has been the centre of controversy, may finally release by next week. The Telugu version of the film, titled Adhirndhi, will release on November 9, as the censor board has now cleared the film
విజయ్ హీరోగా నటించిన తమిళ చిత్రం 'మెర్సల్' తెలుగులో 'అదిరింది' పేరుతో అక్టోబర్ 27న విడుదల కావాల్సి ఉండగా విడుదల కాలేదు. ఆన్ లైన్లో టికెట్లు కొన్న వారికి డబ్బులు కూడా వాపస్ ఇచ్చేశారు. అయితే సినిమా సెన్సార్ వివాదం వల్లే విడుదల కాలేదనే వాదన ఉంది. అదే సమయంలో తెలుగులోనూ ఈ సినిమాను 'అదిరింది' పేరుతో విడుదల చేయాలనుకున్నారు.
‘మెర్సల్' సినిమా తమిళనాడులో దీపావళికి విడుదలైంది. అయితే ఇందులో జీఎస్టీ‌ని ఉద్దేశించి డైలాగులు ప్రధానమంత్రి మోడీ నిర్ణయాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టే విధంగా ఉన్నాయంటూ బీజేపీ నేతలు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. సినిమాలో ఆ డైలాగులు తొలగించాలని కొంత మంది కోర్టుకు వెళ్లారు కూడా.
తెలుగులో ఈ చిత్రాన్ని శరత్ మరార్ విడుదల చేయడానికి రైట్స్ తీసుకున్నారు. అయితే సినిమా రిలీజ్ చివరి నిమిషంలో ఎందుకు ఆగిందనే విషయంపై ఆయన ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. తెలుగు వెర్షన్ ఆంధ్రా, తెలంగాణలో 700 థియేటర్లలో విడుదలకు రంగం సిద్ధం చేశారు. సెన్సార్ సర్టిఫికెట్ సమయానికి చేతికి అందక పోవడం వల్లనే ఇలా జరిగిందా? లేక మరేదైనా కారణంతో సినిమా రిలీజ్ ఆగిపోయిందా? అనే విషయం తెలియాల్సి ఉంది.

Recommended