చెన్నైలో ఇళ్లలోకి వరద నీరు (Video) | Oneindia Telugu

  • 7 years ago
Waterlogging woes continued for residents of Chennai as garbage choked drains overflowing due to days of heavy rains. Rainwater submerged roads, entered homes and schools
ఈశాన్య రుతుపవనాల కారణంగా తమిళనాడులో గత కొద్ది రోజులుగా భారీగా వర్షాలు పడుతున్నాయి.బంగాళాఖాంతంలో ఏర్పడిన అప్పపీడనం కారణంగా గురువారం రాత్రి చెన్నై నగరంలో ఏకదాటిగా ఐదు గంటలకు పైగా వర్షం పడటంతో రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. ఎటు చూసినా నాలుగు అడుగుల ఎత్తు నీరు నిలిచిపోవడంతో కాలు తీసి కాలు పెట్టే పరిస్థితి లేకుండా పోయింది.
దక్షిణ తమిళనాడులో భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్థం అయ్యింది. చెన్నైలోని లోతట్టు ప్రాంతాల్లో వరద, డ్రైనేజ్ నీరు ఇళ్లలోకి చేరిపోవడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది నిర్లక్షం చేస్తున్నారని ప్రజలు ఆందోళనకు దిగారు.
ఇక మరోపక్క తమిళనాడు ప్రభుత్వం నిర్లక్షం చెయ్యడం వలనే చెన్నై నగరం చెరువుల్లా మారిపోయాయని డీఎంకే పార్టీ నాయకులు ఆరోపించారు. ఇదిలా ఉంటే చెన్నై నగరంతో పాటు తమిళనాడులోని సముద్రతీరంలోని లోతట్టు ప్రాంతంల్లో నివాసం ఉంటున్న వారు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ప్రభుత్వం మనవి చేసింది.