పాదయాత్రకు రక్షణ కల్పించాలి : జగన్ యాత్రపై బాబు కుట్రలు | Oneindia Telugu

  • 7 years ago
YSRCP leader Dharmana Prasada Rao on Thursday fired at AP CM Chandrababu Naidu nd responded on his party cheaf Jaganmohan Reddy' Padayatra issue.Ysrcp chief Ys Jagan wrote a letter to Ap DGP Sambasiva rao on Thursday.
ఈ నెల 6వ, తేది నుండి నిర్వహించనున్న పాదయాత్రకు భద్రత కల్పించాలని ఏపీ డీజీపికి వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ లేఖ రాశారు. ఈ నెల 6వ, తేది నుండి ఇడుపులపాయ నుండి జగన్ పాదయాత్రను ప్రారంభించనున్నారు. పాదయాత్రకు సంబంధించి తగిన భద్రతను కల్పించాలని వైఎస్ జగన్ ఏపీ డీజీపీకి గురువారం నాడు లేఖ రాశారు.ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు 3 వేల కిలోమీటర్ల పాదయాత్ర జరుగుతుందని ఆ లేఖలో జగన్ చెప్పారు.
జిల్లాల వారీగా పోలీసులకు రూట్ మ్యాప్ అందజేస్తామని ఆ లేఖలో జగన్ పేర్కొన్నారు. ఏడు నెలల పాటు జరిగే పాదయాత్రకు తగిన భద్రత కల్పించాలని ఈ సందర్భంగా డీజీపీకు విజ్ఞప్తి చేశారు. మరో వైపు పాదయాత్రకు ఎలాంటి ఇబ్బందులు కల్గించకుండా భద్రతను కల్పించాలని వైసీపీ ఎమ్మెల్యే రోజా కూడ మీడియా సమావేశంలో పోలీసులను కోరారు.ఈ మేరకు పోలీసులు సహకరించాలన్నారు.

Recommended