"మెర్సల్" కొత్త వివాదం.. సిగ్గు లేదా? అంటూ హీరో విశాల్ ఫైర్..

  • 7 years ago
The controversy over Vijay-starrer "Mersal" continued today, with 's reported remarks that he had watched the movie online.
దీపావళికి వచ్చిన మెర్సల్ నిజంగానే ఫైర్ పుట్టిస్తూనే ఉంది.సినిమా ఎలా ఉందన్న దాని కంటే కూడా అందులోని కొన్ని డైలాగుల గురించే పెద్ద చర్చ నడుస్తోంది. ఆ చిత్రంలో కార్పొరేట్ హాస్పిటళ్లు.. వైద్యులు.. జీఎస్టీకి వ్యతిరేకంగా విజయ్ పేల్చిన డైలాగులు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తెచ్చిన జీఎస్టీ మీద విజయ్ సెటైర్లు వేయడం భారతీయ జనతా పార్టీ నేతలకు ఆగ్రహం తెప్పించింది.
అటు బీజేపీ నేతలూ, ఇటు డాక్టర్లూ కలిసి విజయ్ సినిమా మీద యుద్దం ప్రకటించారు. అయితే ఈ యుద్దం లో విజయ్ తరపున నిలబడుతోంది తమిళ సినిమా పరిశ్రమ. దాంతో వివాదాన్ని దారి మళ్లించడానికి కొత్త అస్త్రం మీద దృష్టిపెట్టారు. విజయ్ మతం మీదికి ఫోకస్ మళ్లించారు.